SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు అనుమానాస్పందంగా స్కూటీ.. రంగంలోకి ఇంటెలిజెన్స్‌

1 min read

విజయవాడ: తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఇటీవల రాధా వ్యాఖ్యానించడంతో బెజవాడ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. దేవినేని అవినాష్‌, అరవ సత్యం కలిసి రాధా హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ప్రకంపన సృష్టిస్తున్నాయి. అయితే, ఆ కుట్రలతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని అరవ సత్యం కుమారుడు తేజ తెలిపాడు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా కార్యాలయం ముందు కొన్ని రోజులుగా అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉంది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఇటు రాధా కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ పోలీసులు పరిశీలించారు. రాధా కార్యాలయం దగ్గర వివరాలు సేకరించారు. స్కూటీ నాని అనే వ్యక్తిదిగా గుర్తించారు. రాధా కార్యాలయం పక్కన స్వీట్‌ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడిగా గుర్తించారు. వాహన పత్రాలు చూపించి స్కూటీ తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు.
రాధా రెక్కీ కామెంట్స్‌పై రాజకీయం హీటెక్కిపోతుంటే, పోలీసులు తమ పని తాము సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. కుట్ర చేసిందెవరు? రెక్కీ నిర్వహించిందెవరు? అనే కోణంలో జెట్‌ స్పీడ్‌లో దర్యాప్తు చేస్తున్నారు. రెక్కీపై రాధాకఅష్ణ నుంచి సమాచారం తీసుకున్నపోలీసులు..హత్యకు కుట్రపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టిడపి, వైసిపిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాధాకఅష్ణ తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని పంపించడం కూడా రాజకీయ రచ్చకు దారి తీసింది. మరోవైపు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాధా పర్యటనలు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి, బెజవాడ రాజకీయాల్లో మంట రాజేసిన రాధా రెక్కీ కామెంట్స్‌ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్నది ఉత్కంఠగా మారింది

Also read

Total Page Visits: 81 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed