SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కారు బోల్తా పడిన ఘటనలో…విషాదం

1 min read

ప్రకాశం జిల్లా కంచిలి : అప్పటివరకు అన్నయ్య కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. బంధువులు, స్నేహితులతో కలిసి దాబాలో భోజనం చేశారు. జన్మదిన వేడుకల సంతోషంతో ఆ కుటుంబం కారెక్కింది. పిల్లలను షికారుకు తిప్పి వారిని సంతోషపెడదామన్న ఆ తండ్రి కోరిక అతనితో పాటు తోడల్లుని కుమారునికి మరణశాసనమైంది. రోడ్డు పక్కన వేసి ఉన్న కంకర కుప్ప వారిని మృత్యువై కాటేసింది. కంచిలి మండలం జక్కర సమీపంలో మంగళవారం రాత్రి కారు బోల్తా పడిన ఘటనలో సోంపేట పట్టణంలోని మొగలికొత్తూరు వీధికి చెందిన మీసాల సంజీవ్‌ (38), విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన బల్లెడ చేతన్‌రెడ్డి (13) మృతిచెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో సోంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సోంపేట పట్టణంలోని మొగలికొత్తూరు వీధికి చెందిన మీసాల సంజీవ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ఉష, కుమార్తెలు క్రిస్టియానా అలియాస్‌ ఐష్‌, హాసినిప్రియ ఉన్నారు. సంజీవ్‌ అన్న కూతురు పుట్టినరోజు కావడంతో అక్కడికి వెళ్లిన వీరంతా వేడుకల తర్వాత తమ కారులో ఉష అక్క కుమార్తెలు ప్రవీణ, లతిక, కుమారుడు చేతన్‌రెడ్డి, ఉష అన్నయ్య కుమార్తె హర్షితతో కలిసి భోజనానికి బయలుదేరారు. కంచిలి మండలంలోని జాతీయ రహదారిపై జక్కర సమీపంలోని దాబాకు భోజనానికి వెళ్లారు. అనంతరం తిరిగి సోంపేట వెళ్లేందుకు బయలుదేరుతుండగా పిల్లలను కాసేపు సరదాగా తిప్పుదామని సంజీవ్‌ సర్వీసు రోడ్డుపై స్పీడుగా కారును నడిపాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే వేసి ఉన్న కంకర కుప్పకు కారు వేగంగా ఢకొీని బోల్తా పడింది. కారు నడుపుతున్న సంజీవ్‌, ముందు సీట్లో కూర్చున్న చేతన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. క్రిస్టియానా, హాసిని, ప్రవీణ, లతికకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుని భార్య ఉషకు, ఆమె ఒడిలో ఉన్న రెండేళ్ల చిన్నారి హర్షితకు ఏమీ కాలేదు. ప్రమాదం సంభవించిన సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు అందరితో ఆనందంగా గడిపిన చేతన్‌ రెడ్డి విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే కంచిలి ఎస్‌ఐ చిరంజీవులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం కాశీబుగ్గ డిఎస్‌పి శివరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య ఉష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Also read

Total Page Visits: 35 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed