SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎసిబి వలలో పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌

1 min read

భీమడోలు పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ రూ.మూడు వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఎసిబి వలకు చిక్కాడు. లోక్‌ అదాలత్‌లో ఒక కేసు విషయమై రాజీపడేందుకు భీమడోలు పోలీసులను సంప్రదించిన ఒక వ్యక్తి నుంచి రైటర్‌ ఎం.సత్యనారాయణ లంచం డిమాండ్‌ చేశారు. ఎసిబి డిఎస్‌పి టిఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌ కథనం మేరకు పూళ్ల గ్రామానికి చెందిన బుంగా శ్రీను గతనెల తన భార్యపై రాయితో దాడి చేశారన్న ఆరోపణపై భీమడోలు పోలీస్‌ స్టేషన్‌లో 294 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత క్రమంలో భార్యాభర్తలు రాజీ పడ్డారు. కేసును లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునేందుకు కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన భీమడోలు స్టేషన్‌ రైటర్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో స్టేషన్‌ రైటర్‌ 41వ సెక్షన్‌ క్రింద వారికి సహకరించి, లోక్‌ అదాలత్‌లో పరిష్కారానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాల్సి ఉంది. కానీ రైటర్‌ దీనికోసం బెయిల్‌ బాండ్‌ సిద్ధం చేయాలని, ఆధార్‌ కార్డు అందజేయడంతో పాటు ఫార్మాలిటీగా కొంత మొత్తాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 22వ తేదీన మరోసారి స్టేషన్‌రైటర్‌ను సంప్రదించారు. బేరసారాలు అనంతరం రూ.మూడు వేలకు ఒప్పందం కుదిరింది. దీన్ని శ్రీను ఇదంతా తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తరువాత ఎసిబి అధికారులను సంప్రదించారు. తన వద్ద రైటర్‌ లంచం డిమాండ్‌ చేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించిన వీడియోను వారికి అందజేశారు. దీనిపై స్పందించిన ఎసిబి అధికారులు తమ ప్రాథమిక విచారణలో రైటర్‌పై గతంలోనే పలు అవినీతి ఆరోపణలున్నట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో రూ.మూడు వేల నగదును ఇస్తున్న సమయంలో నేరుగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని, గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఎసిబి డిఎస్‌పికి ఎసిబి సిఐలు జి.శ్రీనివాస్‌, కె.నాగేంద్ర ప్రసాద్‌, కె.ఏసుబాబు సహకరించారు.

Also read

Total Page Visits: 190 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed