SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సబ్బవరం వృద్ధురాలి హత్య కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

1 min read

సబ్బవరం వృద్ధురాలి హత్య కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

హత్య చేసిన నిందితుల్లో ఒక జువైనల్ తో పాటు ముగ్గురు యువకుల ప్రమేయం

సబ్బవరం,

విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఈనెల 14వ తేదీన పట్టపగలు ఒక వృద్ధురాలిని హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే సబ్బవరం పోలీసులు పురోగతి సాధించారు ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ వి ఎస్ ఎస్ చంద్రశేఖర రావు మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఈనెల 14న పాత సబ్బవరం లో ఒంటరిగా జీవిస్తున్న ఒడిసెల అప్పల నరసమ్మ (70) హత్యకు గురైంది మృతురాలు కుమారుడు అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు విశాఖపట్నం నుంచి క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ ను రప్పించి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు
దీంతో హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ఒక వ్యక్తికి చెందిన వస్తువు ఘటనా స్థలంలో పడిపోవడం తో దాని ఆధారంగా పోలీసులకు క్లూ లభించింది దీంతో హత్యకేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న ఒక బాల నేరస్తుడు సహా ముగ్గురు నిందితులు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు
హత్యకు పాల్పడిన నిందితులను విచారించిన సమయంలో వారి నుంచి రాబట్టిన వివరాల ప్రకారం ఈనెల14వ తేదీన సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సబ్బవరం పాత రిజిస్టర్ఆఫీసు సమీపంలో ఒంటరిగా జీవిస్తున్న ఒడిసెల అప్పల నరసమ్మ అనే వృద్ధురాలు వద్ద బంగారు నగలు, డబ్బు అధికంగా ఉంటాయనే ఉద్దేశం తో నలుగురు నిందితులు పథకం రూపొందించారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రెండు మోటార్ సైకిల్ పై వచ్చిన నలుగురు నిందితులు ఆ వాహనాలను రైవాడ కాలువ వద్ద పార్క్ చేసి పెట్టారు తమ వెంట తెచ్చుకున్న బ్లాక్ ఆయిల్ స్ప్రేయ్ ను వృద్ధురాలి ముఖంపై చల్లారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆ సమయంలో ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలు, బీరువాలో ఉన్న మరికొన్ని నగలను అగంతకులు మూటకట్టుకుని తిరిగి వెళ్ళే సమయంలో వృద్ధురాలికి తెలివి రావడంతో గుర్తు పడుతుందనే ఉద్దేశం తో చీర కొంగు మెడకు ఉరి బిగించి చంపేశారు తర్వాత తమ,తమ మోటార్ సైకిల్ల పై పరారయ్యారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను క్లూస్ టీమ్ ఇచ్చిన సహకారంతో నిందితులు నలుగురు నీ పైదివాడ అగ్రహారం వద్ద అనుమానా స్పదంగా తిరగడంతో అరెస్టు చేశామన్నారు పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒక జువైనల్ సహా, గవర సాయి అక్షయ్ (21) వంగలి, కిల్లంపల్లి గణేష్ (21), జెట్టి శివ గణేష్ కుమార్ (27), లు ఉన్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు నిందితుల ను అనకాపల్లి కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్లు పేర్కొన్నారు
నిందితులు అపహరించిన బంగారు నగలు 16.7 గ్రాములు బంగారం ఉండగా మిగిలిన గిల్టు నగలను పోలీసులు పేర్కొన్నారు.

Also read

Total Page Visits: 338 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed