SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కోవిడ్ కేర్ సెంటర్ లో పేకాట శిభిరం

1 min read

ప్రభుత్వ భవనంలో పేకాట

..పైగా కోవిడ్ కేర్ సెంటర్

..10 మంది అరెస్టు

అది ప్రభుత్వ కార్యాలయం..పైగా కోవిడ్ కేర్ సెంటర్. ఆపై మాజీ కేంద్రమంత్రి ,మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న భవనం. అందులో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ సిబ్బంది లంచాలకు అలవాటు పడి ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని దొడ్డిదారిన సంఘవిద్రోహ శక్తులకు లీజుకు ఇస్తున్నారు. ఒక్కసారిగా ఈ బండారం బయట పడింది.



  .. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో కరప పోలీస్ స్టేషన్ ఉంది. ఇది మండల కేంద్రం.  అప్పటి పార్లమెంటు సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన నిధులతో కొణిదెల చిరంజీవి కళ్యాణ మండపం నిర్మించారు. దీనిని కరప పంచాయతీ నిర్వహిస్తోంది. దీనికి పంచాయతీ తరపున కార్యదర్శి బాద్యులు గా ఉన్నారు. వాచ్మెన్ ను సైతం  నియమించారు. ఇదిలా ఉంటే దీనినే కోవిడ్ కేర్ సెంటర్ గా నిర్వహిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఇందులో పేషెంట్లు లేరు. కాగా కొన్ని రోజుల నుంచి గా ఇందులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాకినాడ డి ఎస్ పి కే భీమారావు దీనిపై నిఘా పెట్టాలని రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణకు సూచించారు.  బుధవారం అర్ధరాత్రి తరువాత  సిఐ కు పక్కా సమాచారం అందింది. దీనిపై సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ రమేష్ బాబు, 10 మంది పోలీసుల బృందం ఈ పేకాట శిబిరంపై దాడి నిర్వహించింది. ఈ కళ్యాణమండపం బయట కోవిడ్ కేర్ సెంటర్ బోర్డు కూడా ఉంది. దీంతో పోలీసులు కొద్దిసేపు తటపటాయించారు అయితే తరువాత పైభాగానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులను చూసి  9  మంది కేర్ సెంటర్ నుంచి బయటకు పరారయ్యారు.   10 మంది పోలీసులకు  చిక్కారు. వారి నుంచి 33,500 నగదు, 10 మోటార్ సైకిళ్ళు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ మురళీకృష్ణ తెలిపారు. నాగేళ్ల బాలాజీ అనే వ్యక్తి పెద్దఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, గతంలో పేకాట కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడని సిఐ తెలిపారు.  అతడిని ఏ 1 ముద్దాయిగా చూపించమని వెల్లడించారు. పరారైన తొమ్మిదిమంది నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేయడమే గాక కఠినంగా శిక్షిస్తామని  హెచ్చరించారు.

Also read

ఖమ్మం క్షుద్ర పూజల అనుమానం.. పన్ను పీకించిన వైనం.

Total Page Visits: 341 - Today Page Visits: 1

1 thought on “కోవిడ్ కేర్ సెంటర్ లో పేకాట శిభిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed