SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బెదిరించలేదు : గంగిరెడ్డి – బెదిరించారని మరోసారి చెప్పిన రంగన్న

1 min read

పులివెందుల (కడప) : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం సంచలనాన్ని రేకెత్తించింది. సుపారీ ఇచ్చి వివేకాను హత్య చేయించారని.. 9 మంది ప్రమేయం ఉన్నట్లు వాచ్‌మెన్‌ రంగన్న జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ముందు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘నా పేరు చెబితే నిన్ను నరుకుతా’ అని వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారని రంగన్న చెప్పడం కలకలం రేపింది. ఈ ఆరోపణలపై పులివెందులలో ఎర్ర గంగిరెడ్డి శనివారం స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రంగన్నను చంపుతానని తాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆయన తాగేసి నోటికొచ్చినట్లు మాట్లాటడం భావ్యం కాదని అన్నారు.

‘ వివేకాను చంపినోళ్లు, చంపించినోళ్లు ఎవరో నాకు తెలియదు. ఆయనకు చీమంత అన్యాయం కూడా చేయలేదు. నేను వివేకా కార్యాలయం వద్దకే వెళ్లేవాడిని. ఇంటికి వెళ్లడం తక్కువ. వివేకా బతికున్నప్పుడు ఆయన ఇంటివద్ద రంగన్నను చూసి ఒకే ఒక్కసారి ఎవరు నువ్వు ? అని అడిగితే.. తాను కాపలాదారుని అని ఆయన చెప్పారు. తర్వాత ఎప్పుడూ ఆయన్ను చూసింది, మాట్లాడింది లేదు. గతంలో లేనిది ఇప్పుడే రంగన్న నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వివేకా నా పాలిట దేవుడు. నాకు తండ్రి లాంటివాడు.ఆయనకు అన్యాయం చేస్తే నాది ఒక జన్మేనా ? గతంలో ఎప్పుడూ నాకు ఆయనతో విభేదాలు రాలేదు ‘ అని గంగిరెడ్డి పేర్కొన్నారు.

Also read


గంగిరెడ్డి మాటలకు రంగన్న స్పందిస్తూ… ‘ నేనెవరో తెలియదని గంగిరెడ్డి అంటే దానికి నేనేం చెప్పగలను ‘ అని అన్నారు. ఆయన తనను బెదిరించారని రంగన్న మరోసారి స్పష్టం చేశారు. తనపై ఈగ వాలనివ్వబోమని సిబిఐ అధికారులు హామీ ఇవ్వడం వల్లే ఎర్ర గంగిరెడ్డి చంపుతానని బెదిరించిన విషయాన్ని వారికి చెప్పానన్నారు. ‘ గంగిరెడ్డి వివేకా ఇంటికి తరచూ వచ్చేవారు. ఆయన లేనిదే వివేకా ఎక్కడికీ వెళ్లరు. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి బయటే నేను నిద్రపోతున్నా. హత్య ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. ఆ రోజు ఇంటికి ఎవరెవరు వచ్చారో కూడా తెలియదు. నాకు భయం వేయటంతో ఎవర్నీ చూడలేదు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందని సిబిఐ అధికారులు నన్ను అడిగారు. సిబిఐ అధికారులు విచారణ కోసం ఆదివారం నన్ను కడపకు రమ్మన్నారు. ఇంతకుముందు నాలుగు రోజులు వారి వద్దే ఉన్నాను ‘ అని రంగన్న వ్యాఖ్యానించారు.
సిబిఐ విచారణలో రంగన్న వెల్లడించిన పేర్ల జాబితాలోని సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఇంటికి శనివారం తాళం వేసి కనిపించింది. ఆయన, కుటుంబ సభ్యులు వారం రోజులుగా లేరని స్థానికులు చెబుతున్నారు. దస్తగిరి, ఆయన కుటుంబ సభ్యులు బయటకు రాలేదు. శనివారం రంగన్న ఇంటివద్ద మఫ్టీ పోలీసులతో అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు.

తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

Total Page Visits: 183 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed