SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నాటుసారా నిర్మూలనలో నేర సమాచార సేకరణలో మహిళా పోలీసులు కీలక పాత్రట్రైనింగ్ ప్రోగ్రామ్ సమావేశం

1 min read

నాటుసారా నిర్మూలనలో నేర సమాచార సేకరణలో మహిళా పోలీసులు కీలక పాత్రట్రైనింగ్ ప్రోగ్రామ్ సమావేశం

బొబ్బిలి


బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి.ఐ. ఆర్. జై భీమ్, ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి సీతానగరం మండలం, బలిజపేట మండలం మరియు బొబ్బిలి మండలం పరిధిలో గల మహిళా సంరక్షణ పోలీసులకు ఒక్కరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్.జై భీమ్ మాట్లాడుతూ, నాటుసారా నిర్మూలనలో నేర సమాచార సేకరణలో మహిళా పోలీసులు కీలక పాత్ర వహించాలని తెలుపుతూ నాటు సారా తయారీ విధానం, నాటు సారా తాగడం వల్ల ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు సచిత్రంగా తెలిపారు. అంతే కాకుండా నాటుసారా తాగడం వలన కుటుంబపరంగా సమాజపరంగా జరిగే నష్టాలుగురించి వివరించండమే కాకుండా బొబ్బిలి ఎస్ ఇ బి స్టేషన్ నందు కేసు నమోదు ప్రక్రియా విధానం, రికార్డులు నిర్వహించే విధానం గురించి అవగాహన కల్పించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు సంబంధించిన వివిధ చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో ఎస్.ఐ చిన్నం నాయుడు, హెచ్ సి మాధవి దేవి, సిబ్బంది చంద్రప్రసాద్, జయరాంనాయుడు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 223 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed