SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

భారీ నుంచి అతి భారీ వర్షాలు

1 min read

11న శ్రీహరికోటాకడలూరు మధ్య తీరం దాటే అవకాశం

– 13న మరో అల్పపీడనం

విశాఖపట్నం…ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా నైరుతి బంగాళాఖాతంలో రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర తమిళనాడు తీరానికి నవంబరు 11 నాటికి చేరుకోనుందని, అదే రోజు ఆంధ్ర తీరాన్ని శ్రీహరికోటాకడలూరు మధ్య వాయుగుండం తీరం దాటనుందన్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48గంటల్లో బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలోనూ కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి, నెల్లూరులో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరులో మండల స్థాయి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నపట్నం చెరువు నిండుకుండలా మారి మొరవ పోతుండడంతో వంక సాగే ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జీడి రేవుల వంక కల్వర్టు ప్రమాద స్థితికి చేరడంతో రాకపోకలు నిలిపి వేయడం జరిగిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను నంజంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Also read

Total Page Visits: 338 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed