SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దిక్కుతోచని స్థితిలోడ్వాక్రా సంఘ సభ్యులు

1 min read

అధికార పార్టీ అండదండలతో తన భర్త గ్రామంలో వార్డ్ మెంబర్ కావడంతో తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ధీమా తో గ్రామంలోని స్వయం సహాయక సంఘాల డబ్బులను తన ఇష్టానుసారంగా వాడుకున్నా డ్వాక్రా సంఘ సభ్యులు ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామం లో చోటు చేసుకుంది.

కోరుమామిడి గ్రామం లో 160 స్వయం సహాయక సంఘాలు గాను 4 గ్రామ సంఘాలు గా ఉన్నాయి .
దానిలో ఒకటి అయిన జోతిర్మయి గ్రామ సంఘంలో 57 సంఘాలకు గాను స్త్రీ నిధి కి అర్హత కలిగిన 18 సంఘాలకు గాను 30 లక్షల 87 వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు . ఈ రుణాలను బ్యాంకులకు చెల్లించే క్రమంలో వి.వో ఏ గా పనిచేస్తున్న పడమటి సాయి కి బ్యాంకులో అప్పు తీర్చమని సభ్యులు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నా ఆమె మాత్రం బ్యాంకుకు చెల్లించకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది అని, ఈ విషయమై
ఆమెని నిలదీస్తే తమపై నానా దుర్భాషలాడి, తమపై దాడి చేసిందని సంఘ సభ్యులు వాపోయారు. ఇదే విషయమై డ్వాక్రా సంఘ సభ్యులు మే 7వ తేదీన నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్ సమిశ్రగుడెం లో ఫిర్యాదు చేయగా తమ ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడుతున్నారని డ్వాక్రా సంఘ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు.
ఇదే విషయముపై పశ్చిమ గోదావరి జిల్లా DRDA ప్రాజెక్టు డైరెక్టర్ గారికి అందిన ఫిర్యాదు మేరకు స్త్రీ నిధి AGM శశి కుమార్, నిడదవోలు క్లస్టర్ మేనేజర్ రత్నకుమారి లు మంగళవారం సాయంత్రం కోరుమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు విచారణ చేపట్టగా విచారణ జరిగే సమయంలో కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న వి.వో.ఏ పడమటి సాయి భర్త , వార్డు మెంబర్ అయిన పడమటి పెద్దిరాజు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని మీరు ఏమి చేస్తారో చేసుకోండి, నాకు గ్రామ పెద్దల అండదండలు,రాజకీయ పలుకుబడి ఉన్నాయని సభ్యులపై విరుచుకుపడి, నానా

దుర్భాషలాడటం తో సంఘ సభ్యులందరూ చెల్లాచెదురై పారిపోయారు. విచారణకు వచ్చిన అధికారులకు సైతం విస్మయానికి గురిచేసింది.
ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకుని తమకు సరైన న్యాయం చేయాలని కోరుమామిడి డ్వాక్రా సంఘ సభ్యులందరూ కోరుకుంటున్నారు.

శ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి సహస్రనామార్చన తేదీ: 21-07-2021

Total Page Visits: 397 - Today Page Visits: 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed