SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

75ఏళ్ల తర్వాత కూడా రాజద్రోహ చట్టం అవసరమా?…
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

1 min read

**

★రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ ‘124-ఏ’ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

★దేశద్రోహం ఓ వలస చట్టమని అభివర్ణించిన న్యాయస్థానం.. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టం అవసరమా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామన్న కోర్టు.. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

★సెక్షన్‌ 124-ఏ చట్టాన్ని సవాలు చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఎన్‌.జి. వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

★ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజద్రోహం చట్టం బ్రిటన్‌ నుంచి తెచ్చుకున్న వలస చట్టం. స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్‌ వారు ఈ చట్టం తీసుకొచ్చారు.

★భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్‌ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారు. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది. ఇప్పుడు కూడా ఈ చట్టం అవసరమా’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.

*పిచ్చోడి చేతిలో రాయిలా..*

★‘‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవి ఎన్ని? సెక్షన్‌ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు?ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

★పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు.

★బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు, అధికార దాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు.

★రాజద్రోహం సెక్షన్‌ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్లుంది’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

★రాజద్రోహం సెక్షన్‌ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రాన్ని సూచించింది. ఈ చట్టం రద్దుపై వైఖరిని తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని వెల్లడించింది

Also read

Total Page Visits: 52 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed