SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

AP Finace Departmentలో సమాచారం లీక్‌.. ముగ్గురు ఉద్యోగులపై వేటు!

1 min read

అమరావతి : ఎపి ఆర్థికశాఖలో సమాచారం లీక్‌ కలకలం చెలరేగింది. కీలక సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారంటూ ముగ్గురు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. సస్పెండైన వారిలో కె.వరప్రసాద్‌, డి.శ్రీనుబాబు ఆర్థికశాఖలో సెక్షన్‌ అధికారులు కాగా.. నాగులపాటి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఈ ముగ్గురిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. వీరు ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బయటికి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ముగ్గురు ఉద్యోగులు టిడిపి సీనియర్‌ నేత, పిఎసి చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సమాచారం చేరవేస్తున్నారని, అందుకే వీరిపై చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల ఎపి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఆర్థిక శాఖలో కొన్ని కార్యకలాపాలకు లెక్కలు లేవని పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Also read

Total Page Visits: 129 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed