SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విద్యా దీవెన కాదు విద్యా శాపం..శ్రీ పరుచూరి అశోక్ బాబు

1 min read

*అమరావతి*

_*టీడీపీ శాసనమండలి సభ్యులు, శ్రీ పరుచూరి అశోక్ బాబు విలేకర్ల సమావేశం వివరాలు..*_

*విద్యా దీవెన కాదు విద్యా శాపం*

★ విద్యా దీవెన పథకం పేరుతో పాత స్కీంకు కొత్త ప్రకటన ఇచ్చారు.

★ ఇస్టాల్ మెంట్ పథకాలకు కూడా కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు ఇచ్చి సాక్షి పత్రికకు లబ్ది చేకూరుస్తున్నారు.

★ ఒక ఇంజనీరింగ్ చదవే విద్యార్ధి ఫీజ్ రూ.40వేలు ఉంటే దఫాకు రూ.10వేల చొప్పున 4దఫాల ఫీజ్ రీయంబర్స్ మెంట్ చెల్లిస్తారు.

★ కాలేజీలు కూడా ఇదే పద్దతిలో ఫీజులు కట్టించుకోవాలి అప్పుడే ఈ పథకానికి అర్ధం పరమార్ధం.

★ అంతే గాని రంగు రంగుల ప్రకటనలు ఇస్తే ప్రజలు ఎంత నష్టపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీపై ఉంది.

★ టిడిపి ప్రభుత్వం ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను కాలేజీలకు చెల్లించడం ద్వారా విద్యార్ధులు సకాలంలో చదువును పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు తీసుకొని భయటకు వచ్చే వారు.

★ టిడిపి ప్రభుత్వం 2018-19లో 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 10.97 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది.

★ అది కూడా కన్వినర్ కోటా లో ఉన్న వారికి మాత్రమే రీయంబర్స్ చేస్తున్నారు.

★ అంటే బీపీఎల్ కుటుంబాలు లక్ష మంది ఉంటే అందులో కన్వినర్ కోటా కింద సీట్లు 30 శాతం మాత్రమే వస్తాయి.

★ కాని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అందరికి రీయంబర్స్ మెంట్ అందించాం.

★ ఈరకమైన దోపిడి, మోసం ఎందుకు చేస్తున్నారు?

★ కలర్ ఫుల్ యాడ్స్ ఇచ్చినంత మాత్రానా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవనుకోవడం పొరపాటు.

★ జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.

★ నీతి ఆయోగ్ నాణ్యమైన విద్యలో టీడీపీ హయాంలో 3వ ర్యాంక్ ఉంటే నేడు మీ హయాంలో 19వ ర్యాంక్ కు పడిపోయింది.

★ 2017-19లో రూ.19,653 కోట్లు, 2018-19లో రూ. 19,341 కోట్లు విద్య కోసం ఖర్చు చేశాం. కాని మీ హయాంలో 2019-20లో విద్య కోసం ఖర్చు చేసింది రూ.19,961 కోట్లు ఖర్చ చేశారు.

★ గత బడ్జెట్ కంటే ప్రస్తుత బడ్జెట్ లో కనీసం 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాలి.

★ ఉన్నత విద్యలో కూడా 2020-21 లో రూ. 2,276 కోట్లు, 2021-22 బడ్జెట్ అంచనాల్లో రూ.1973 కోట్లు ఇచ్చాం.

★ అంటే గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.300 కోట్లు బడ్జెట్ తగ్గించారు.

★ అంటే ఉన్నత విద్య అంటే ప్రభుత్వానికి ఎంత చిన్నచూపే బడ్జెట్ లెక్కలు అద్దం పడతాయి.

★ ప్రభుత్వ ప్రకటనలతో ప్రజలు మోసపోతున్నారు.

★ పేపర్లలో ప్రభుత్వ ప్రకటనలు చూసి బ్యాంకుకు వెళ్లికి ఈ నెల మా ఖాతాలో ఏమైనా డబ్బులు పడ్డాయా అని అడిగే పరిస్థితికి వచ్చారు.

★ అంటే యాడ్ వస్తే డబ్బులు వచ్చినట్లు లెక్కా?

★ స్కీమ్ లు పెట్టి వాటిని భాగాలుగా విడతీసి ప్రజలను మభ్యకు గురి చేస్తున్నారు.

★ లెక్కల్లో చూపించాల్సిన ప్రతిభ ప్రజలపై చూపిస్తూ వారిని మనోవేదనకు గురి చేస్తున్నారు.

★ తెలుగుదేశం ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచేందుకు రెండు డీఎస్సీల ద్వారా 16,820 మందిని అపాయింట్ చేశాం.

★ మీ హాయంలో ఎంత మందిని అపాయింట్ చేశారు?

★ దాదాపు 20వేల మంది టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

★ మేం రాగానే డిఎస్సీ చేసేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పటి వరకు ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు.

★ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధ్యాయులను లిక్కర్ షాపుల వద్దకు తెచ్చి ఊడిగం చేయించారు.

★ 600 మంది టీచర్లను కరోనా సమయంలో బయటికి వచ్చేలా చేసి వారి మృతికి కారకులయ్యారు.

★ పత్రికల్లో రంగు రంగుల యాడ్ లు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదు.

★ ఇంటర్నీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం తీసేశారు.

★ విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇచ్చే నిధులను రద్దు చేశారు.

★ మెరిట్ పిల్లలకు ఇచ్చే ఉన్నత విద్యా పథకం రద్దు చేశారు.

★ పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చే విధానాన్ని కూడా రద్దు చేశారు.

★ నిరుద్యోగ భృతిని కూడా తీసేశారు. 9, 10 తరగతి చదివే ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేశాం.

★ ఇవ్వాల్సి ఉన్న సైకిళ్లను ఇవ్వక గోడౌన్లకే పరిమితం చేశారు.

★ టీడీపీ హయాంలో మెరిట్ సాధించిన విద్యార్థుల కోసం బెస్ట్ అవలబుల్ స్కూళ్లను పెడితే వాటిని కూడా రద్దు చేశారు.

★ 16 వ తేది నుంచి స్కూళ్లు తెరుస్తామంటున్నారు.

★ అయితే వారి కోసం ఇంకా ఇంతవరకు ఎటువంటి సదుపాయాలు సమకూర్చలేదు.

★ మోసపూరిత పత్రికా ప్రకటనలతో సాక్షి పత్రిక బాగుపడిందే కానీ విద్యార్థులు బాగుపడలేదు.

★ విద్యార్థులతో పరీక్షలు రాయించడంలో ప్రభుత్వ పెత్తనం చెల్లవచ్చుగానీ ఆ పరీక్షలు పాసయ్యాక సర్టిఫికెట్లు ఇచ్చేటప్పడు ప్రభుత్వ పెత్తనం చెల్లదు.

★ టీడీపీ హయాంలో సజావుగా ఉన్న వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు.

★ 500 కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద ఉన్న ఫండ్ జగనన్న విద్యా దీవెనకు ట్రాన్స్ ఫర్ చేయాలని జీవో నెంబర్ 74ను 28వ తేదిన విడుదల చేసి బీసీలను ఇబ్బంది పాలు చేశారు.

★ నవరత్నాలు, కులాల అభివృద్ధికే నిధులు ఖర్చు చేస్తున్నారు.

★ బడ్జెట్ ను కులాలవారిగా విభజించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కతుంది.

★ రాష్ట్రంలో కోటి 62 లక్షల మంది లబ్దిదారులు అని మోస పూరిత ప్రకటనలిచ్చారు.

★ ఈ రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది విద్యార్థులు లేరు.

★ మీరు తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. నిరూపించుకోవాలని . ఆదిమూలపు సురేష్ కు సవాల్ విసురుతున్నాను.

★ పాత స్కీములన్నింటిని రద్దు చేశారు. ప్రజలకు వంద రూపాయలు రావాల్సింది పాతిక రూపాయలు చేతిలో పెడుతున్నారు.

★ ఇది ప్రజలు గమనిస్తున్నారు.

★ ప్రజలకు నిజమైన సహాయం ఎలా చేయాలో గత టీడీపీ ప్రభుత్వానికే తెలుసు.

★ రంగు రంగు ప్రకటనలు చూసి మోసపోయే రోజులు పోయాయి.

★ టెక్స్ బుక్స్, నోట్ బుక్స్ కోసం తెలుగుదేశం ప్రభుత్వం స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ కు ఇస్తే మీరు మాత్రం మీ కమీషన్ ల కోసం పూనా కంపెనీకి రూ.100 కోట్లకు ఇచ్చారు.

★ విద్యా దీవెన ప్రకటనలో వాస్తవం అని మీరు నమ్మితే బహిరంగ చర్చకు పిలుపునిస్తున్నాం.

★ లేదంటే మీరిచ్చిన ప్రకటనను విత్ డ్రా చేసుకోవాలి.

★ నేడు మీరిచ్చిన ప్రకటన ఉత్త బూటకం.

Also Read

Total Page Visits: 146 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed