SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దేవినేని ఉమా, చంద్రబాబు కలిసి రండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం… వసంత కృష్ణ ప్రసాద్

1 min read

జూలై 29, 2021
తాడేపల్లి- వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం

*మైలవరం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ పాయింట్స్..*

*- 2018లో రూ. 3 కోట్లు లంచం తీసుకొని కొండపల్లి భూములకు పర్మిషన్ ఇప్పించింది దేవినేని ఉమానే.*

*- కొండపల్లి భూములపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన స్టే పై ఏం సమాధానం చెబుతావు బాబూ..?*

*- దేవినేని ఉమా, చంద్రబాబు కలిసి రండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం.*

*- దేవినేని ఉమా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తోడు దొంగలు*

*వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*

1- ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని, జరగనిదానిని నాకు ఆపాదించి దేవినేని ఉమా డ్రామాలు ఆడుతున్నాడు. జి. కొండూరు మండలం పరిధిలోని లోయ, కడియం పోతవరం గ్రామాల పరిధిలో సర్వే నంబరు 143లో గడిచిన 40 ఏళ్ళుగా క్వారీయింగ్ జరుగుతోంది.

2- టీడీపీ ప్రభుత్వం హయాంలో, 2018లో జిల్లా అధికారులు వాటిని రెవెన్యూ పోరంబోకు భూములు అని క్వారీలు ఆపేశారు. క్వారీ ఓనర్లు అంతా అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా దగ్గరకు వెళ్ళారు. ఉమా దగ్గరకు వెళ్ళిన వారిలో ఇప్పుడు నా పక్కన కూర్చున్న, గతంలో టీడీపీ నాయకుడుగా ఉన్న శేఖర్ ఒక లీజుదారుడు, మరోపక్కను ఇంకొకరు కూడా ఉన్నాడు. వ్యాపారుల దగ్గర నుంచి దేవినేని ఉమా రూ. 3 కోట్లు లంచం తీసుకుని అప్పటి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి దగ్గరకు వారిని తీసుకెళ్ళి.. అక్టోబరు 5, 2018న ఆయన సంతకంతో ఆ భూములపై స్టే ఆర్డర్ ఇప్పించ్చారు. అవి ఫారెస్టు భూములు కాదు, రెవెన్యూ భూములు అని. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ మీడియాకు విడుదల చేస్తున్నాను. మీరే క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. విచారించి వార్తలు రాయండి.

3- అక్రమ క్వారీయింగ్ అని దేవినేని ఉమా చెబుతున్న సర్వే నంబరు 143లో లీజు దారుడు చెన్నుబోయిన రాధా పేరుతో ఆమె భర్త చెన్నుబోయిన చిట్టిబాబు మొన్నటివరకు టీడీపీ జెడ్ పీటీసీ సభ్యుడుగా ఉన్నాడు. బెలాట్రిక్స్ అనే మరో మైనింగ్ కంపెనీకి చెందిన క్రషర్ ను 2016 డిసెంబరు 4న దేవినేని ఉమా తన స్వహస్తాలతో ప్రారంభించాడు. ఆ ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేస్తున్నాను. ఆ భూములను నేడు దేవినేని ఉమా ఫారెస్ట్ భూములు అంటూ డ్రామాలు ఆడుతున్నాడు. ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా, మీరు అసలు మనుషులేనా..?

4- నాలుగు దశాబ్దాల నుంచి ఏవైతే రెవెన్యూ భూములు అని చెబుతున్నారో, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తితో చెప్పించి.. 2019లో కొండ పోరంబోకు కింద టీడీపీ హయాంలోనే డిక్లేర్ చేశారో.. మీకు లంచాలు ముట్టకపోయే సరికి ఫారెస్టు భూములని డ్రామాలు చేస్తారా..?

5- మైలవరం నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, దాదాపు 20 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తుంటే, 2019లో అక్కడి ప్రజలు ఓడించారన్న కక్ష, ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం కాబోతోందన్న దుగ్ధతో దేవినేని ఉమ నాకు ఇటువంటి దురుద్దేశాలు ఆపాదిస్తున్నాడు.

6- నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, మా కుల మీడియాను అడ్డు పెట్టుకుని పేజీలకు పేజీలు అబద్ధపు, అసత్య కథనాలు రాయించాడు. ఇదే దేవినేని ఉమ అధికారం పోయిన తర్వాత… 15 పర్యాయాలు కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, గతంలో ఏ స్వలాభం పొందకపోతే.. స్థానికులు ఛీ కొడుతున్నా ఎందుకు అన్నిసార్లు అక్కడకు వెళతాడు.

7- దేవినేని ఉమా చెబుతున్నట్లుగా అవి రెవెన్యూ భూములా.. ఫారెస్టు భూములా.. జర్నలిస్టులు కూడా అధ్యయనం చేయండి. ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పటానికి ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్ ను అడ్డు పెట్టుకుని నాపై పనిగట్టుకుని బురదజల్లుతున్నారు. అందుకే టీడీపీని తెలుగు దొంగల పార్టీ అంటున్నారు. దొంగలంతా కలిసి రోజూ మాట్లాడుతున్నారు.

8- మీ కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన స్టే పై ఏం సమాధానం చెబుతావు చంద్రబాబూ..?
– వాస్తవాలు తెలుసుకోకుండా, దేవినేని ఉమాకు వంతపాడి మీ పరువు తీసుకుంటున్నారు. ఉమా పోరాటం చేయడం లేదు.. అబద్ధాన్ని నిజం చేయడానికి, గతంలో మాదిరిగా లంచాలు రాలేదన్న బెంగతో మీడియా ముందు డ్రామాలు ఆడుతున్నాడు.
– అక్కడ మా పార్టీ నాయకుడు కారు ధ్వంసమైతే, మా పార్టీ దళిత కార్యకర్తపై దాడి జరిగితే.. దేవినేని ఉమా డ్రామాలేంటి.. ఆయనకు వంతపాడుతున్న మా కుల మీడియా, చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల వాగుడేంటి..?

9- మా కుల మీడియాకు… టీడీపీలో ఉన్న కమ్మ వాళ్ళే కమ్మ వాళ్ళా… మేం కాదా..?
– వేరే పార్టీల్లో ఉన్న కమ్మవాళ్ళను ఒక పథకం ప్రకారం, వారి ప్రాధాన్యత తగ్గిస్తారు. ఎందుకూ పనికిరాని, సోడాలు కొట్టుకునే దేవినేని ఉమా లాంటి వాళ్ళని ఎల్లో మీడియా భుజానికి ఎత్తుకుంటుంది.
– ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మిగతా ఎల్లో మీడియా ఎన్ని కట్టుకథలు అల్లినా.. వీళ్ళ వల్ల మన కులానికి నష్టం, దరిద్రమే అన్నది గుర్తెరగాలి. వీళ్ళను నమ్మి వందల కోట్ల రూపాయలు కమ్మ వాళ్ళే నష్టపోయారు. 2019 ఎన్నికల్లో లగడపాటి- రాధాకృష్ణ సంయుక్త సర్వేలు చూసి నష్టపోయారు.

10- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇదే ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా అబద్ధాలు, అసత్యాలతో నాపైన ఎన్నో వార్తలు వండి వార్చారు. ఎన్నికల్లో నన్ను ఓడించాలని కుట్రలు చేశారు.
– దేవినేని ఉమా, రాధాకృష్ణ తోడు దొంగలు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెందిన మనుషులు కొండపల్లి క్వారీయింగ్ పేరుతో నన్ను బెదిరించి, నా దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని బ్లాక్ మెయిల్ చేశారు. నేను ధర్మాన్ని నమ్ముతాను, నన్ను మీరు పీకేదేమీ లేదు అని చెప్పాను.
– చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీతి బాహ్యమైన దేవినేని ఉమాలాంటి వారిని పక్కన పెట్టుకోవడం వల్లే కృష్ణా జిల్లాలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. భవిష్యత్తులో రాష్ట్రంలో టీడీపీనే తుడిచి పెట్టుకుపోతుంది.

11- ప్రతిదానిపై ట్వీట్లు పెట్టే లోకేష్ ఒక ప్రశ్న. నీకు నియోజకవర్గం పేరు పలకడం చేతకాదు, నోరు తిరగదు. ముందు వాటిని పలికి ఆ తర్వాతే మాట్లాడు.
– చంద్రబాబు, మిగతా ఈ తెలుగుదేశం దొంగల ముఠా నిత్యకృత్యం ఏమిటంటే… ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని టీడీపీ ఆఫీసులో ఇద్దరితో మాట్లాడించడం, తర్వాత లోకేష్ ట్వీట్లు, ఫైనల్ గా చంద్రబాబు మాట్లాడటం.. ఇదంతా ఒక డ్రామాగా నడిపిస్తారు.
– కొండపల్లి ఫారెస్టు భూమిలో కృష్ణప్రసాద్ క్వారీయింగ్ చేశాడు అని నిరూపించగలిగితే.. దేనికైనా సిద్ధం, చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను.
– దేవినేని ఉమ, చంద్రబాబు కలిసి రండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం.
– తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళతారు. దేవినేని ఉమాను మేం జైలుకు పంపలేదు. గ్రామస్థులను రెచ్చగొట్టి విధ్వంసం చేయించినవాడిపై పోలీసులు చర్యలు తీసుకోరా. మేమే రెచ్చగొట్టినట్లైతే.. అసలు దేవినేనికి ఏ శాస్తి జరిగేదో..!

Also read

పిడుగురాళ్ల లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు

Total Page Visits: 149 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed