SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

25న ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు

1 min read


ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 25వ తేదీ ఆదివారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

వట్లూరులోని సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, దీనికి ఇప్పటికే రెండు హాళ్లు ఏర్పాటు చేశామని, కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా మరో రెండు హాళ్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా మూడు డివిజన్లు ఏకగ్రీవమైన నేపథ్యంలో 47 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్‌ జరుగుతుందని, దీనికోసం 47 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకే రౌండ్‌లో కౌంటింగ్‌ పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. దీనికోసం 57 మంది సూపర్‌వైజర్లను, 207 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లను, 57 మంది సహాయకులను ఏర్పాటు చేసినట్లు, నలుగురు ఉన్నతాధికారులను సూపర్‌వైజర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందికి శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం కూడా శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు గురువారం సాయంత్రానికి ఏజెంట్ల జాబితా అందజేయాలని రాజకీయ పార్టీలకు తెలియజేశామన్నారు.

Also read

ఎన్నికల సిబ్బందికి శనివారం కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని, నెగిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందికి మాస్క్‌, ఫేస్‌ షీల్డ్‌ అందజేస్తామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు విజేతతోపాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, కౌంటింగ్‌ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. కోవిడ్‌ నిబంధన దష్ట్యా ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని, కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులతో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులు కౌంటింగ్‌ హాల్‌కు వచ్చే వరకు వీడియో చిత్రీకరణ ఉంటుందని, కౌంటింగ్‌ హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌ అనంతరం ముగ్గురు అభ్యర్థులు మరణించారని, అయినప్పటికీ ఆయా డివిజన్లలో కౌంటింగ్‌ పూర్తిచేస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, డిఆర్‌ఒ డేవిడ్‌రాజు, ఆర్‌డిఒ పనబాక రచన, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

‘బెయిల్‌’ రాగానే విడుదల

Total Page Visits: 278 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed