SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

Apcc Press Release*
*హిందుత్వ ముసుగులో ప్రజలను విభజించవద్దు*

1 min read

*Apcc Press Release*
*హిందుత్వ ముసుగులో ప్రజలను విభజించవద్దు*

*మీరు మనువాదులు.. మేము భారతీయులం*

*ఆంధ్రప్రదేశ్ లో కొత్త నాటకానికి తెర తీసిన బీజేపీ*

*ప్రజల ఐక్యతను దెబ్బ తీసేలా ప్రవర్తించవద్దు – ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్*

విజయవాడ : హిందుత్వ ముసుగులో ప్రజలను విభజించేలా భారతీయ జనతా పార్టీ కొత్త నాటకానికి తెర తీసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. సారాయి.. వీర్రాజు..కోడిగుడ్ల వీర్రాజు.. సమాజాన్ని విభజించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పన్నారు. జిన్నా టవర్ వలన జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడు అనేది ప్రజలు తెలుసుకుంటారని, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదని చెప్పారు. స్వాతంత్రోద్యమంలో వారి మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ పాత్ర గురించి చదువుకోవాలని సూచించారు. బ్రిటిష్ వారి కాళ్ళకు మొక్కి క్షమించమని ఉత్తరాలు రాసిన చరిత్ర తెలుసు కోవాలని కోరారు. శుక్రవారం ఆయన ఈ మేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు అందరూ భారత మాత ముద్దు బిడ్డలని, మేమంతా భారతీయులమని, సమాజాన్ని విభజించే మాటలకూ సోము వీర్రాజు స్వస్తి పలకాలని అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రావలిసిన నిధులు, ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాల్సిన బీజేపీ నాయకులు వాటిని పక్కన పెట్టి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని శైలజానాధ్ ధ్వజమెత్తారు. చీకటి ఒప్పందాలతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీని చంపిన చరిత్ర బీజేపీదని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో ప్రజలందరూ సమానమేనని, ప్రజల ఐక్యతను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తామని, జిన్నా టవర్ ను కూల్చేస్తామని ప్రకటనలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని విమర్శించారు. ఇలాంటి వారిని ప్రజాస్వామబద్దంగా రోడ్ల మీదే అడ్డుకుని తేల్చుకుంటామని హెచ్చరించారు.

Also read

Total Page Visits: 57 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed