SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విద్యాలయాలు అబివృద్దే ఆనందగజపతి ఆశయం..భీశెట్టి

1 min read

విద్యాలయాలు అబివృద్దే ఆనందగజపతి ఆశయం..భీశెట్టి

విజయనగరం

ఆశ్రమం లో ఆనంద్ జయంతి వేడుకలు
విజయనగరం జిల్లాలోని మాన్సస్ ట్రస్ట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు మంచి విద్యను అందిస్తూనే, తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవాలయాలను ఎంతో అభివృద్ధి చెయ్యాలని ఆనంద్ గజపతిరాజు నిరంతరం తపనపడ్డారని డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,స్వర్గీయ ఆనంద గజపతిరాజు 71వ జయంతి జామి మండల అట్డాడ బి.ఎన్. ఆర్.ఆశ్రమం లోశనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముక్య అతిథిగా పాల్గొన్న భీశెట్టిబాబ్జి ముందుగా ఆనంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనంద్ పివిజి తనయుడు గా విద్యా సంస్థలను అద్భుతమైన రీతిలో నడిపించి దేశంలోనే మాన్సస్ కి ప్రాధాన్యత రప్పించారని,అనంద్ ఉన్నత విద్యావంతుడు అవ్వడంవలన దేశ విదేశాల్లో ఏకనమిక్స్ పై పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల కి అవగాహన క్లాసులు ఇచ్చారని,తను జీవించి ఉన్న ఆఖరు నిముషాలు వరకూ అనంద్ దేశంలో జరుగుతున్న రాజకీయాలు పరిశీలిస్తూనే ఉన్నారని,అనంద్ నిరంతర విద్యార్థి గానే ఉండేవారని ప్రజా సమస్యలపై గొప్ప అవగాహన ఉండేదని అన్నారు,అనంద్ కుటుంబ సభ్యులు పాకలపాటి బద్రీనారాయన మాట్లాడుతూ ఆనంద్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గా ఉత్తరాంధ్ర లో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందుబాటులోకి తెచ్చారని ఉత్తరాంద్రలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు,ఐటీఐ లు ఎక్కువ శాతం కాలేజీలు అనంద్ మంజూరు చేసినవేనని,మంత్రి గా,ఎంపీగా, మాన్సస్ అధ్యక్షుడు గా అద్భుతమైన పనితీరు కనపర్చారని బద్రి నారాయణ అన్నారు,అనంతరం ఆశ్రమం లోని వృద్ధులకి భోజనాలు అందించారు.ఈ సమావేశంలో పాకలపాటి శౌమిత్రి ,ఆశ్రమం ప్రతినిధి ఆడారి హరితా సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.

Alsoread

Total Page Visits: 50 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed