SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సామాజిక సేవలను మరింతగా విస్త్రుత పరుస్తాం

1 min read



*మూడవ వ్యవస్థాపక దినోత్సవము* సందర్భముగా
– ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం.

ఒంగోలు: అత్యుత్తమ సామాజిక సేవలను నిర్వహిస్తున్న ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ మూడవ వ్యవస్థాపక దినొత్సవమును క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం అధ్యక్షతన జూమ్ అంతర్జాల వేదిక పై ఘనంగా జరిగినది.

సామాజిక సేవలను మారుమూల ప్రజలకు చేరువచేయాలని, ఏ ఒక్కరూ ఆరోగ్య పరంగా, ఆర్దికముగ ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో, భారతీయ సనాతన ధర్మాలను ప్రజలకు తెలుపవలసిన ఆవశ్యకత ఉందని భావించి “మానవ సేవయే మాధవ సేవ” భావనతో పూజ్య బాపూజి పేరున “ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్స్” ను రాజమహేంద్ర వరం వాస్థవ్యులు మహనీయ గ్రంధి రామచంద్ర రావు 2018 జూన్ 22వ తేదీన రాజమండ్రి గోదావరి గట్టు వద్దగల సదనం సమావేశం హాలులో వివిధ పార్టీల, ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో ప్రారంభించారని తెలిపారు. అప్పటి నుండి దేశ విదేశాలలో ఇప్పటి వరకు 132 క్లబ్స్ ప్రారంభించి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వివరించారు. గత సంవత్సరం కోవిడ్ మొదటి విడత లో స్థానిక ఎయిమ్స్ క్లబ్స్ ఒంగోలు, ఒంగోలు జూనియర్స్, ఒంగోలు వనిత, మరియు కాకినాడ, కర్నూలు సింగరాయకొండ రాజమహేంద్ర వరం తదితర క్లబ్ శాఖలు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారని ఆయా క్లబ్స్ కార్యవర్గాన్ని అభినందించారు. సేవలను కొనసాగింపుగా వివిధ పథకాలను రూపొందించి ప్రతి అవసరార్ధికి చేయగలిగినంత సహాయ సహకారాలు అందించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు.

కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు కోల్పొతున్న తరుణంలో సనాతన ఆయుర్వేదమును తయారు చేసి ప్రజలలో ధైర్యాన్ని నింపిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులు బొనిగి ఆనందయ్యకు ఆయుర్వేద శిరోరత్న బిరుదును ఈ జూలై 4వ తేదీన వారి పరోక్షంగా ప్రకటన చేశామని, త్వరలో వారిని కలసి సత్కారం చేస్పామని, మరియు ఆనందయ్య కు వైద్య చికిత్సా విభాగములో “పద్మశ్రీ” అవార్డును బహుకరించవలసినదిగా భారత ప్రభుత్వమునకు నామినేషన్ పంపామని తెలిపారు.

కార్యక్రమం ప్రారంభ సూచికగా ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్ అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ మీనాక్షి, మీనాశ్రీలు దేవతా మూర్తులకు పూజ, అనంతరం గణపతి స్తోత్రమునకు నృత్యాభినయం తో సభ్యులకు స్వాగతం పలికారు.


సమావేశములో ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు, సహకార్యదర్శి ధనిశెట్టి రాము, ఎయిమ్స్ క్లబ్ వనిత అధ్యక్షురాలు యం. ఉమాదేవి, ఎయిమ్స్ క్లబ్ సింగరాయకొండ అధ్యక్షులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శి అచ్చుత చెంచు సుబ్బారావు, ఎయిమ్స్ క్లబ్ కర్నూలు అధ్యక్షులు మట్టా చంద్ర శేఖర్ మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు.

సమావేశం జాతీయ గీతాలాపనతో ముగించారు.

Total Page Visits: 91 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed