SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జోరు వానలో వనంపల్లి గ్రామస్తులు నిరసన

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా..పెనుమంట్ర..జోరు వానలో వనంపల్లి గ్రామస్తులు నిరసన
# అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి
# పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
# తక్షణం వనంపల్లి డ్రైనేజీలు సరి చేయాలి
# వర్షపు ముంపును అరికట్టాలి

పెనుమంట్ర న్యూస్ ప్రతినిధి sgs

మండలంలోని నెగ్గిపూడి గ్రామపంచాయతీ పరిధిలో వనంపల్లిలో అనధికార లేఅవుట్ల వల్ల డ్రైనేజీ,వర్షపు నీటిపారుదల లేక వనంపల్లి రోడ్లన్నీ ముంపుకు గురి కావడంతో పంచాయతీ కార్యదర్శికి విన్నవించుకున్న మార్పు లేకపోవడంతో వర్షపు వానలో గ్రామంలోని మహిళలు,వార్డు సభ్యులు,యువత డ్రైనేజీ,వర్షపునీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే గత సంవత్సరాలలోని పాలకవర్గం సమయంలో నెగ్గిపూడి, వనంపల్లి గ్రామాలలో రియల్ మాఫియా ప్రజాప్రతినిధుల ముసుగులో ఇబ్బడిముబ్బడిగా అనధికార లేఅవుట్ లు వేసేశారు.నాటి గ్రామ,మండల సంబంధిత శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంతో నీటి వాలు బోధెలు సైతం కబ్జాలు చేసేసి,మురికి బోధెలు సైతం మూసేసి రోడ్లను వేసి ఇండ్ల ప్లాట్లుగా అమ్మకాలు జరపడంతో సమస్య ఉత్పన్నమైంది.అంతేకాక ప్రభుత్వ ఖజానాకు,గ్రామ పంచాయతీకి రావలసిన నిధులకు భారీగా గండి పెట్టారు.పంట పొలాల అనధికార లేఔట్లను పూడ్చడానికి గ్రామ ప్రధాన రహదారులపై భారీ వాహనాలలో మట్టి,గ్రావెల్ తదితర రవాణా చేయడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి వేసిన రోడ్డ్లు ధ్వంసం కావడంతో పాటు,డ్రైనేజీలను సైతం మూసేశారు.దీంతో వనంపల్లి గ్రామంలోని డ్రైనేజీ నీరు,వర్షపు నీరు పారుదల లేకపోవడం,రోడ్లపై డ్రైనేజీ నీరు,చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో పలు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ నీటి నిల్వలతో భారీగా గోతులు ఏర్పడి చిన్నారులు, మహిళలు,వృద్ధులు, వాహనచోదకులు పలుమార్లు పడిపోయి గాయాలు అవ్వడం జరుగుతుంది.ఈ వనంపల్లి ప్రధాన రహదారులపై,నీటి నిల్వల విషయమై పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి మొర్రపెట్టుకున్నప్పటికీ,పంచాయతీ పాలకవర్గ సమావేశం పెట్టమని కోరినప్పటికీ దానిపై స్పందన లేదని ఒకటవ వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలుకే పరిమితం కాగా సంక్షేమ దాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కృషితో విడుదలైన నిధులను వెచ్చించి మంత్రి శ్రీరంగనాథరాజు హయాంలో రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Also read

అదేవిధంగా ఏ ఎండకా గొడుగు అన్నట్లు అధికారంలో ఉన్న పార్టీలలో చేరుతూ పదవులను అడ్డుపెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, నెగ్గిపూడి గ్రామ పంచాయతీలకు కట్టవలసిన అనధికార లేఔవుట్ల ఫీజులను కట్టే విధంగా,అనధికార లేఔవుట్ వల్ల పూడ్చి వేసిన నీటి బోధెలను సైతం తిరిగి త్రవ్వించి, గ్రామంలోని నీటి వాలు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.సకాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లిస్తున్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా గతంలో ఇస్తారాజ్యంగా అనధికార లేఅవుట్లలో సరైన తీర్మానాలు లేకుండా రోడ్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని,పంచాయతీ ఆదాయాన్ని కాపాడాలని వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర డిమాండ్ చేశారు.సకాలంలో పంచాయతీ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలని నెగ్గిపూడి, వనంపల్లి గ్రామాలలో విధిగా గ్రామసభలు నిర్వహించాలని వార్డు సభ్యులు,గ్రామస్తులు కోరారు. జోరు వర్షం వానలో సుమారు నాలుగు గంటల పైగా నిరసన తెలియజేస్తున్న వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర,కడలి జ్యోతి,కొవ్వూరు సీత, కుమార్లను,గ్రామస్థులు, మహిళలు అనధికార లేఔవుట్లపై చర్యలు,డ్రైనేజీ వర్షపునీటి వాళ్ళు ఏర్పాటు చేయుట,సకాలంలో పాలకవర్గ సమావేశం నిర్వహించడం,ప్రతి నెల గ్రామసభలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్లు తెలపడంతో వైయస్సార్ సిపి నాయకులు సత్తి వెంకటరెడ్డి, సర్పంచ్ మామిడిశెట్టి ధనలక్ష్మి, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సత్తి విష్ణు కుమార్ రెడ్డిల సమక్షంలో మండల అధికారులు అందుబాటులో లేకపోవడంతో తో నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు ఇచ్చిన హామీలతో నిరసనను విరమించారు.

Total Page Visits: 182 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed