SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విశాఖజిల్లా, చీడికాడ మండలం లో గిరిజనబాలిక హత్య కలకలం రేపింది.

1 min read



వివరాల్లోకి వెళితే చీడికాడ మండలం జాజుల పాలెం పంచాయితీ శివారు, కుసర్లపాడు గ్రామానికి చెందిన దేవుడమ్మ 14 సంవత్సరాలు. టెన్త్ క్లాసు పాస్ అయింది.

నిన్న మధ్యాహ్నం నుంచి ఆ ప్రక్క గ్రామం అయినటువంటి పనసపట్టు గ్రామానికి చెందిన నమ్మి కుమార్ అనే యువకుడు (తొమ్మిదో తరగతి చదువుతున్నాడు)తో సన్నిహితంగా కలసి తిరగడం స్థానికులు చూసారు.

సాయంత్రం 6 గంటలకు దేవుడమ్మ శవమై కనిపించటంతో.. అంత కన్నీరు మున్నీరుగా విలపించారు.

తన స్నేహితుడు నన్ని కుమార్, ఆమెను స్వయంగా మోసుకొని తీసుకొని వచ్చి ఇంటిదగ్గర పడేసి మీ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయిందని చెప్పుటంతో..

అనుకోని సంఘటన వల్ల ఆ ప్రాంతమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు మైనర్లు కావటంతో పోలీసులు మరింత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఏరియా హాస్పిటల్ నుండి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

బైట్:ఇలియాస్ మహమ్మద్
సి.ఐ చోడవరం

Total Page Visits: 154 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed