SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

100 కోట్ల ప‌నిలో 50 కోట్ల అవినీతా..? – మంత్రి అనీల్ పై సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి పైర్

1 min read

స‌ర్వేప‌ల్లి కాలువ నిర్మాణమంటూ మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి మండిప‌డ్డారు.. రివ‌ర్స్ టెండ‌రింగ్ కు వెళ్లాల్సిన వ‌స్తుంద‌ని 99 కోట్ల 90 ల‌క్ష‌లు చూపించి.. అనంత‌రం దాని అంచ‌నాల‌ను భారీగా పెంచేశార‌ని ఆరోపించారు. పెంచిన అంచ‌నాల‌ను ఎవ‌రి జేబులోకి వెళ్తాయో చెప్పాల‌న్నారు. రామ‌లింగాపురంలోని ఎస్ ఈ కార్యాల‌యంలో ఎస్ ఈ ని కలిసి.. దీనిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం సంధించారు.. 15 కోట్ల రూపాయ‌లు అంచ‌నాలు ఎలా పెంచార‌ని ప్ర‌శ్నించారు. అదికార పార్టీ నేత‌లు చెప్పిన‌ట్లు వింటే.. భ‌విష్య‌త్ లో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని హెచ్చ‌రించారు.. స‌ర్వేప‌ల్లి కాలువ‌లో అవినీతి జ‌రుగుతోంద‌ని, బెడ్ కాంక్రీట్ వేస్తున్నార‌ని మొద‌టి నుంచి తాము ఆందోళ‌న చేస్తున్నామ‌ని గుర్తు చేశారు.
మంత్రిలో నిజాయితీ ఉంటే టెండర్ అయిన తర్వాత రేవైజ్ చెయ్యాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. మొదటే పూర్తి ఎస్టిమేట్ వెయ్యవచ్చు క‌దా అన్నారు.. తూర్పు ప్రాంత ప్రజల్లో కాలువ అడుగు భాగం కాంక్రీట్ వేస్తే భూగర్భజలాలు అడుగింటిపోతాయనే భయం ఉందని,. దీనిని తెలుగుదేశంతో పాటు సీపీఎం, జనసేన మరియు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.. రేవైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం అడుగు భాగం కాంక్రీట్ వేస్తే 40 అడుగులు కాంక్రెట్ పడితే భూగర్భజలాలు పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు.. మట్టి సాయిల్ టెస్టింగ్ కొరకు 39ల‌క్ష‌లు ఎందుకు ఖ‌ర్చు పెట్టార‌ని ప్ర‌శ్నించారు. .దీంతో ఎస్ ఈ కూడా స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు.. అనంత‌రం కోటంరెడ్డి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.. రేవైజ్డ్ ఎస్టిమేట్ లో 14.90 కోట్లకు పెంచి టెండర్ ప్రక్రియ అయిన తర్వాత 110 కోట్లకు పెంచుకున్నారని ఆరోపించారు. మంత్రి అనీల్ అవినీతిని అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.. ఈ స‌మావేశంలో మాజీ కార్పొరేట‌ర్లు పిట్టి స‌త్య‌నాగేశ్వ‌రావు, దారా జైరాజ్, మామిడాల మ‌ధు, క‌ప్పిర శ్రీనివాసులు,మహేంద్ర రెడ్డి,సబీర్ ఖాన్, పసుపులేటి మ‌ల్లికార్జున , హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Total Page Visits: 231 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed