SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

హైదరాబాద్‌ నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ. అధికారులు

1 min read

హైదరాబాద్‌, అమరావతి, చేగుంట, టంగుటూరు గ్రామీణం: రెండేళ్ల క్రితం జరిగిన ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) అధికారులు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాసంఘాల నాయకుల ఇళ్లలో గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 14 చోట్ల జరిగిన ఈ సోదాలు కలకలం రేపాయి. పలువురి ఇళ్ల నుంచి హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, పుస్తకాల వంటివి స్వాధీనం చేసుకున్నారు. సోదాలు చేపట్టిన సమయంలో ఇళ్లలో నుంచి ఎవరినీ బయటకు వెళ్లేందుకు, లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌ నుంచి వచ్చిన బృందంతోపాటు ఎన్‌.ఐ.ఎ. హైదరాబాద్‌ విభాగానికి చెందిన అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాల్లో పాల్గొన్నారు.


2019 జులై 28న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా నాగర్నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు, ఒక పౌరుడు చనిపోయారు. ఈ కేసు 2021 మార్చి 18న ఎన్‌.ఐ.ఎ.కి బదిలీ అయింది. సంజు అలియాస్‌ పండు, లక్ష్మణ్‌, మున్ని, దశరిలతోపాటు 40 మంది నిందితులని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో వనస్థలిపురంలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు కె.రవిచందర్‌ ఇంటి తాళం పగలగొట్టి మరీ సోదాలు నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని ఓ మహిళా హాస్టల్‌లో ఉంటున్న న్యాయ విద్యార్థిని పద్మ గదిలో, నాగోల్‌లో హిందుత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికకు చెందిన నార్ల రవిశర్మ, బి.అనూరాధ, హిమాయత్‌నగర్‌లో రచయిత అరుణాంక్‌ లత, అల్వాల్‌లో అమరవీరుల బంధుమిత్రుల సంఘానికి చెందిన పద్మకుమారి, భవాని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఏపీలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణరావు ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.05 గంటల వరకు సోదాలు సాగాయి. అదే జిల్లా చీరాలకు చెందిన చేనేత సంఘం నాయకుడు మాచర్ల మోహన్‌రావు, విజయవాడలో విప్లవ రచయితల సంఘం నాయకుడు అరసవెల్లి కృష్ణ, ప్రజా కళాకారుడు డప్పు రమేశ్‌, విరసం నాయకుడు ఎం.శ్రీనివాసరావు, విశాఖపట్నంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు అన్నపూర్ణ, నెల్లూరులో అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు రమణయ్య నివాసంలో సోదాలు నిర్వహించారు. మెదక్‌ జిల్లా చేగుంటలో మావోయిస్టు నేత దుబాసి శంకర్‌ అలియాస్‌ రమేశ్‌ కుమారుడు దేవేందర్‌ ఇంట్లో వేకువజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోదాలు కొనసాగాయి.

* ఎన్‌.ఐ.ఎ. సోదాలను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు.
* విరసం నేత కల్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటం నేరమా అని ప్రశ్నించారు

Also read

Total Page Visits: 101 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed