SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

హరితవనాల పెంపుకై మొక్కలు నాటిన భాజప కార్యకర్తలు

1 min read


ఒంగోలు(sgs న్యూస్): భారతీయ జనతాపార్టి రాష్ట్ర పిలుపు మేరకు డా॥ శ్యాంప్రసాద్ ముఖర్జి వర్ధంతి జూన్ 23వ తేదీ నుండి పక్షం రోజులపాటు వారి జయంతి జూలై 6వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో భాగముగా పర్యావరణ సమతుల్యతకు హరిత వనాల అభివృద్ధికై మొక్కలు నాటే బృహత్కర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

దేశ సమగ్రత కోసం, కాశ్మీరును దేశంలో భాగం చేయాలని, దేశంలోని ప్రతి పౌరునికీ ఒకే విధమైన చట్టం అమలు కావాలని పోరాడిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నుండి జయంతి వరకు పక్షం రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగముగా నేడు జిల్లా ఆర్టిసెల్ కన్వీనర్ పిన్నంటి తిరుమల రావు ఆధ్వర్యములో గాంధీనగర్ ఆరవ లైన్ లొ మొక్కలు నాటిన భాజప కార్యకర్తలు.

ఈ సందర్భముగా పిన్నంటి తిరుమల రావు మాట్లాడుచూ జన సంక్షేమం కొరకు ప్రధాని మోదీ కృషిచేస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ ని భాజపా వివిధ విభాగాలు విశేషంగా నిర్వహిస్తున్నాయని, ప్రజల భాగస్వాములను చేయుటకు మొక్కలు నాటి వాటి సంరక్షణ కు స్ధానిక ప్రజల సహకారంతో ముందుకు వెళుచున్నామని తెలిపారు.

కార్యక్రమములో ప్రకాశం జిల్లా ఆర్టిజెన్ సెల్ కన్వీనర్ పిన్నంటి తిరుమల రావు, భాజప ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి కేసిన రమేష్,
కనమల రాఘవులు, జాతీయ నాయకులు, జిల్లా కార్యదర్శి సత్యవతి, నగర నాయకులు భువనేశ్వరి, పార్వతి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్, బజరంగదళ్ నగర ప్రముఖ్ సీతారామయ్య, ఫిషర్ మెన్ కన్వీనర్ రాజేష్ వర్మ, సంఘ సీనియర్ నాయకులు తీగల కాళిదాసు, జిల్లా నాయకులు ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 83 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed