SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న స్కిట్‌ కళాశాల మూసివేతకు రంగం సిద్ధమైంది.!*

1 min read

*అమరావతి*

*

దేవదాయశాఖ కమిషనరు అర్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో ఈ విషయంపై సుదీర్ఘ సమావేశం జరిగింది.

ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో పెద్దిరాజు కూడా హాజరయ్యారు.

ముక్కంటి ఆలయానికి  కళాశాల నిర్వహణ భారంగా మారడంతో మూసివేయడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

శ్రీకాళహస్తి పట్టణంలో 1997-98 విద్యా సంవత్సరంలో స్కిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఏకైక ఇంజనీరింగ్‌ కళాశాల కూడా ఇదే.

శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విద్య అందించాలనే ఆశయంతో అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ తీసుకుని ఈ కళాశాలను ఏర్పాటు చేయించారు.

పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే సుమారు 55 ఎకరాలు సేకరించి భవనాలు నిర్మించారు.

కళాశాల ఏర్పాటు చేసే సమయంలో ముక్కంటి ఆలయం తరపున రూ.50లక్షలు డిపాజిట్‌ చేశారు.

ఈ సొమ్ము మాత్రమే ఆలయం తరపున అప్పట్లో ఇచ్చారు.

విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల ద్వారా భవనాలు నిర్మించారు.

ల్యాబ్‌ వసతి కల్పించారు.

2014వ సంవత్సరం వరకు ఈ కళాశాలలో విద్యా ప్రమాణాలు చాలా బాగుండేవి.

చేరడానికి విద్యార్థులు పోటీ పడేవారు.

దీంతో ఈ కళాశాలకు అనుబంధంగా 2009-10వ విద్యా సంవత్సరంలో డిప్లొమా తరగతులను ప్రారంభించారు.

2014 తరువాత యాజమాన్యం పట్టించుకోక పోవడం…? అఽధ్యాపకులు వర్గాలుగా విడిపోవడం…? రాజకీయ జోక్యం పెరగడం కారణంగా కళాశాల పతనం ప్రారంభమైంది.

ప్రస్తుతం ఈ కళాశాలలో ఇంజనీరింగు ఫస్టియర్‌లో 17మంది విద్యార్థులు,ఫైనలియర్‌ విద్యార్థులు 30మంది లోపే ఉన్నారు.

డిప్లొమో మొదటి సంవత్సరంలో 12మంది, చివరి సంవత్సరంలో 22మంది విద్యార్థులు ఉన్నారు.

బోధనా సిబ్బంది 31మంది, బోధనేతర సిబ్బంది 37మంది, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వారు 25మంది ఉన్నారు.

గతంలో విద్యార్థుల పీజులతోనే వీరికి వేతనాలు చెల్లించేవారు.

అయితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ముక్కంటి ఆలయ నిధుల నుంచి వీరికి జీతాలు చెల్లించాల్సి వస్తోంది.

గతంలో నెలకు సుమారు రూ.25లక్షలు చెల్లించేవారు.

కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం నెలకు రూ.40లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది.ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే స్కిట్‌ కళాశాలలో విద్యార్థులు చేరే అవకాశాలు కనిపించక మూసివేయడమే ఉత్తమమని దేవదాయశాఖ గట్టి నిర్ణయానికి వచ్చేసింది.

స్కిట్‌ కళాశాలకు చెందిన కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల విచారణ జరిగింది.

ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో అదేరోజు దేవదాయశాఖ తమ తుది నిర్ణయాన్ని న్యాయస్థానానికి తెలియజేయనుంది.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించి… ఉన్న విద్యార్థులను ఇతర కళాశాలలకు పంపించి… కళాశాల మూసి వేయాలని నిర్ణయానికి వచ్చారు.

దీనికి సంబంధించి ముక్కంటి ఆలయ అధికారులు మూడు రోజుల పాటు రాత్రింబగళ్లు కసరత్తు చేశారు.

వీరు తయారు చేసిన నివేదికలను దేవదాయశాఖ కమిషనరు అర్జునరావుకు సమర్పించారు.

భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు కూడా లేఖ రాశారు.

మరోవైపు స్కిట్‌ను మూసివేయకుండా వుంచడానికి ప్రయత్నాలు జరిగాయి.

అయితే కళాశాల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు మూసివేయాలనే నిర్ణయానికి వచ్చారు.

Total Page Visits: 52 - Today Page Visits: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed