SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే…

1 min read

అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌ రెడ్డి తనయుడు శ్రవణ్‌కుమార్‌ రెడ్డితో ప్రవీణ్‌కు ఉన్న భాగస్వామ్య వ్యాపారం బెడిసికొట్టిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం బళ్లారిలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు, ఆస్పత్రి వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. కాపు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డ్డి, ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి కుమారులు బళ్లారిలో కియా కార్ల షోరూంను భాగస్వామ్యంతో ప్రారంభించారు. లావాదేవీల లెక్కలు తేలుద్దామని ప్రవీణ్‌ను సోమశేఖర్‌రెడ్డి కుమారులు రెండుమూడు నెలలుగా పిలుస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కాలయాపన చేస్తూ వచ్చారు.
ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి ఈ విషయంలో కలుగజేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్వయంగా ఎమ్మెల్యే తన కుమారులతో కలిసి బళ్లారి సిటీలోని హోస్పేట్‌ రోడ్డులో ఉన్న కార్ల షోరూం వద్దకు చేరుకున్నారు. అప్పటికీ ప్రవీణ్‌ షోరూం వద్దకు రాలేదు. అసహనానికి గురైన సోమశేఖర్‌రెడ్డి ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి ‘‘మేం షోరూం దగ్గరే ఉన్నాం. తక్షణం ఇక్కడికి రావాలి’’ అన్నారు. దీంతో ప్రవీణ్‌ తన ఇంటి నుంచి కారులో బయలుదేరారు. ఆ సమయంలోనే ఒక క్యాన్‌లో పెట్రోల్‌ నింపుకొని కారులో పెట్టుకున్నారు. ప్రవీణ్‌ షోరూం వద్దకు చేరుకోగానే… ఎమ్మెల్యే, ఆయన కుమారులు లావాదేవీల ఫైల్‌ ఇవ్వాలని అడగగా.. వారి మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రవీణ్‌ను ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి గట్టిగానే మందలించినట్టు తెలిసింది. దీంతో ప్రవీణ్‌ తీవ్ర మనస్తాపం చెంది, పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. షోరూంలోని యువకులు ఆయనను అడ్డుకున్నారు. వెంటనే బళ్లారి సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

Total Page Visits: 161 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed