SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విశాఖ, విజయనగరంలో ఎసిబి సోదాలు.. తహశీల్దార్‌ కార్యాలయాల్లో రికార్దుల తనిఖీ

1 min read

విజయనగరం జిల్లా డెంకాడ తహశీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్న ఎసిబి అధికారులు
విజయనగరం, విశాఖపట్నం : అవినీతి ఆరోపణల నేపథ్యంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని తహశీల్దార్‌ కార్యాలయాల్లో మంగళవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో ఐదు, విజయనగరం జిల్లాలో ఆరు మండలాల్లో తనిఖీలు చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. భూ లావాదేవీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

విజయనగరం జిల్లాలో జామి, ఎస్‌.కోట, కొత్తవలస, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండల తహశీల్దార్‌ కార్యాలయాల్లో భూ సంబంధిత సమస్యలు, రికార్డుల నిర్వహణ, కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారం తదితర అంశాలపై ఆరా తీశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. భూ లావాదేవీలు, రెవెన్యూ కార్యకలాపాల్లో జాప్యం వంటి ఆంశాలపై సోదాలు నిర్వహిస్తున్నామని, బుధవారం కూడా కొనసాగుతాయని, ఎవరైనా బాధితులుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చునని ఎసిబి డిఎస్‌పి రఘువీర్‌ విష్ణు ఈ సందర్భంగా తెలిపారు. ల్యాండ్‌ కన్వర్సన్‌ కార్యకలాపాల తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. జామి తహశీల్దార్‌ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా లభ్యమైనట్లు గుర్తించామన్నారు.

విశాఖ జిల్లాలోని విశాఖ అర్బన్‌, రూరల్‌, పెందుర్తి, పద్మనాభం, అచ్యుతాపురం తహశీల్దారు కార్యాలయాల్లో సోదాలు చేశారు. భూ సర్వేలకు పెట్టుకున్న దరఖాస్తులు, ధృవపత్రాలు, పెండింగ్‌ దరఖాస్తులు, తిరస్కరించిన అర్జీల వివరాలపై ఆరా తీశారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. పద్మనాభం తహశీల్దార్‌ కార్యాలయంలో 114 మంది రైతులకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలు వారికి పంపిణీ చేయకుండా అధికారులు బీరువాలో ఉంచిన విషయాన్ని గుర్తించారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు తెలిపారు

Also read

Total Page Visits: 41 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed