SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విశాఖలో కూలిన బ్రిడ్జి పిల్లర్.. ఇద్దరు మృతి

1 min read

విశాఖ: పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలికి అధికార యంత్రాంగం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి-సబ్బవరం మధ్యలో ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే పిల్లర్ కూలడంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సైడ్ బీమ్‌లు ఒక్కసారిగా కిందపడ్డాయి. ఆ సమయంలో కింద ఉన్న కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఈ ప్రాంతంలో మూడు బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలాన్ని చాలా రోజులుగా పార్కింగ్ ప్లేస్‌గా వినియోగిస్తున్నారు. ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు పార్కింగ్ చేయడంతో ప్రమాదం జరిగింది. పిల్లర్ కూలిన సమయంలో పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో జనాలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Total Page Visits: 91 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed