SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వివేకా హత్య కేసు: రంగంలోకి సీబీఐ ఐజీ స్థాయి అధికారి.. కీలక వ్యక్తులను ప్రశ్నించే అవకాశం

1 min read

*కడప జిల్లా (పులివెందుల)*

_*వివేకా హత్య కేసు: రంగంలోకి సీబీఐ ఐజీ స్థాయి అధికారి.. కీలక వ్యక్తులను ప్రశ్నించే అవకాశం!*_

*మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.*

★ కేసును విచారించేందుకు కొత్తగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రామ్ కుమార్ ఇవాళ కడపకు చేరుకున్నారు.

★ మొన్నటి వరకు డీఐజీ సుధాసింగ్ 49 రోజులపాటుగా కేసులోని అనుమానితులను విచారించారు.

★ వాచ్మెన్ రంగన్న రెండు రోజుల కిందట కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

★ అంతకంటే ఒకరోజు ముందే సీబీఐ డీఐజీ సుధాసింగ్ను తిరిగి విజయవాడకు పంపించారు.

★ ఆమె స్థానంలోనే తాజాగా రామ్ కుమార్ను నియమించారు.

★ రంగన్న వాంగ్మూలాన్ని కీలక పరిణామంగా భావిస్తున్న సమయంలో.. కొత్త అధికారి రావటం ఆసక్తిని రేపుతోంది.

★ మరోవైపు రేపట్నుంచే కేసులోని కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.

_*సుధాసింగ్ నేతృత్వంలోనే విచారణ..*_

★ కొద్దిరోజుల కిందట మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు.

★ సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సుధాసింగ్ను తప్పించారు.

★ ఇప్పటికే కేసులో పలువురు కీలక అనుమానితులను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి విచారించారు.

★ ఈ దర్యాప్తు విచారణకు ఆమెనే నేతృత్వం వహించారు.

_*రంగన్న వాంగ్మూలం*_

★ మరోవైపు ఈ కేసులో 23వ తేదీన 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు.

★ మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు.

★ వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్… రంగన్న మినహా మిగిలిన వారెవ్వరూ లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది.

★ తర్వాత రంగన్నను సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు.

★ తాజాగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రంగంలోకి దిగటంతో ఆసక్తిని రేపుతోంది.

Also read

Total Page Visits: 91 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed