SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వివేకానంద రెడ్డి హత్య కేస్ లో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి?.. CBI

1 min read

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ లేదు. గతంలో కంటే సీబీఐ ఈ సారి దూకుడు పెంచి విచారణ చేస్తోంది. గడిచిన 25 రోజులుగా కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. మాజీ డ్రైవర్ దస్తగిరి. వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ తుల్లాలను ఇప్పటికే పలుసార్లు విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకోగా కొత్తగా ఒక కుటుంబం తెర మీదకు వచ్చింది. పులివెందులకి చెందిన కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని మొత్తం సీబీఐ గత కొన్ని రోజులుగా పదే పదే విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ కుటుంబ సభ్యులనే పదే పదే విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేస్ లో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి? అసలు వివేకాకి, కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి పరిచయం ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఈసారి కొత్త కోణంలో విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఇది వరకు గతంలో విచారించిన పాత వ్యక్తులనే మళ్లీ మళ్లీ పిలిచి విచారించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా వివేకా వద్ద డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగి రెడ్డిని విచారించేవారు. ఈసారి వీరితో పాటు పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబంలో సభ్యులందరినీ విచారిస్తున్నారు. వారిని కడప, పులివెందుల కేంద్రాలుగా సాగుతున్న విచారణలో గత 20 రోజులు నుంచి ప్రతి రోజు కృష్ణయ్య యాదవ్ కుంటుంబంలో విచారణకి హాజరవుతుంది. వారు ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకుంటున్నారు.

Total Page Visits: 89 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed