SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విజయనగరంఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడుకి నిరసన సెగ.

1 min read


రామభద్రపురం (విజయనగరం జిల్లా): ఊరంతా ఒక్కటయ్యారు. వైసీపీ అరాచకాలపై పిడికిలి బిగించారు. గ్రామానికి తమ ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్నారు. సినిమా స్టైల్లో పొలిమేరలో కాపుకాశారు. ఎమ్మెల్యే రాగానే ఒక్కసారిగా కారును చుట్టిముట్టారు. ప్రజల నిరసన చూసి భయపడిన ఎమ్మెల్యే పోలీస్ జీపులో ఇంటిదారిపట్టారు. ఇదంతా విజయనగరం జిల్లా, బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడుకు ఎదురైన పరాభవం..

రామభద్రపురం మండలం, కొండకెంగువలో ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసేందుకు చిన్న అప్పలనాయుడు వచ్చారు. అయితే ఎమ్మెల్యేపై ఊరిలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎంతలా అంటే వైసీపీ జెండా పీకేసే అంత.. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా వైసీపీ కార్యకర్తలకు ఇళ్లు ఇవ్వడం, పెన్షన్లు మంజూరు చేయడం ఇలా ఏ ప్రభుత్వ పథకం వచ్చినా.. ఇలా చేస్తుండడమే గ్రామస్తుల ఆగ్రహానికి కారణం. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కారు దిగనివ్వకుండా అడ్డుకున్నారు. జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కారు దిగే సమయంలో ఆయనపై ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యే కిందపడిపోయారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయినా నిరసనకారులు తమ పట్టు వీడలేదు. భయంతో ఎమ్మెల్యే పోలీస్ జీపులోకి ఎక్కారు. అయినా నిరసన కారులు విడిచిపెట్టలేదు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను తీసుకుని తమ జీపుతో స్పీడుగా వెళ్లిపోయారు.

Total Page Visits: 104 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed