SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రైతులకు కరోనా కష్టాలు

1 min read

మార్కేటింగ్ లేక తీవ్ర ఇబ్బందులు

పోలాల్లో కుళ్ళిపోతున్న పంట

నష్టపరిహారం అందకుంటే ఆత్మహత్యలే శరణ్యం

సత్యవేడు నియోజకవర్గంలో ఉద్యానవన పంటలను సాగుచేసిన రైతుల పరిస్థితి ఇదీ..!

చిత్తూరు జిల్లా సత్యవేడు లో అప్పులు చేసి తిప్పలు పడి సాగుచేసిన పంటను కరోనా లాక్ డౌన్ కారణంగా మార్కేటింగ్ చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గం పూర్తిగా పరిస్థితి ఇలాగే ఉండగా ప్రభుత్వం తరపున ఎలాంటి నష్టపరిహారం అందించలేమని అధికారులు వెల్లడిస్తున్నారు.

నియోజకవర్గంలో ఉద్యానవన పంటలను సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది.

చేతికందిన పంటను అమ్ముకోలేక పోలాల్లోనే కుళ్ళబెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

సాధారణంగా పుచ్ఛ, కిర్నీ పంటలను సాగుచేసే రైతులు తిరుపతి ,తమిళనాడులోని కోయంబేడు మార్కేట్ లకు తరలించి అమ్మడం జరుగుతుంది.

కానీ కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడకూ పోలేని పరిస్థితిలో
పండించిన పంటను పోలాలకే పరిమితం
చేయకతప్పడం లేదు.

సత్యవేడు మండలంలోని అమాసరెడ్డి కండ్రిగ లో కుప్పస్వామి అనేరైతు పుచ్చ ,కిర్ని సాగుచేశాడు. పంటను అమ్ముకోలేక ,పంటసాగుకు చేసిన అప్పును తీర్చలేక ,ఓవైపు ఇబ్బందులు మరో వైపు అప్పు ఇచ్చిన వారి బెదిరింపులు వంటి పరిస్థితులను తట్టుకోలేకున్నామని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం, సాయం అందించకుంటే రైతులకు చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో మార్కేటింగ్ లేకుండా నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించలేమని ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక ఎమ్మేల్యే ఆదిమూలం రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ,అధికారులతో చర్చించి న్యాయం చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed