SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి…ఏ ఐ వై ఎస్ డిమాండ్

1 min read




బొబ్బిలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బొబ్బిలి పట్టణంలో ఉన్న కామ్రేడ్ గంటి ప్రసాదం స్మారక భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు. కోట.అప్పన్న మాట్లాడుతూ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ స్వయంగా వారి ప్రసంగంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ను ప్రకటించిన సంఘటనలను గుర్తు చేసుకోవాలని తెలియజేశారు, అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని, నిరుద్యోగులు మరియు వారి కుటుంబాలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన అనంతరం నిరుద్యోగులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు,ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ తక్షణం విడుదల చేయాలని లేనిపక్షంలో ఈనెల 19న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐ ఎస్ ఎప్ ముఖ్య నాయకులు ఎమ్ గణెష్ హనీష్ జి రాజు పి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 105 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed