SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మేదర్ల సమస్యను పరిష్కరించిన ఆదిరెడ్డి వాసు

1 min read


రాజమహేంద్రవరం సిటీ :
స్థానిక 30వ వార్డు మేదరపేటలోని మేదర్ల సమస్యకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పరిష్కారం చూపించారు. అప్సరా థియేటర్ ప్రాంతంలో రోడ్డు పక్కన మేదర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. ఆ విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి వాసు మేదరపేట చేరుకుని మేదర్లు, నగర పాలక సంస్థ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ఆ ప్రాంతం ఇరుకు రోడ్డు అయినందున వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అలాగే పనులు అనంతరం చెత్తాచెదారం రోడ్డుపై వేయకుండా చూడాలని మేదర్లకు సూచించారు. ఈ నెల 9వ తేదీ నుంచి యధావిధిగా పనులు చేసుకోవచ్చని తెలిపారు. స్థానిక టీడీపీ నాయకులు చాపల చిన్ని రాజు, మేదర్లు ఆయన వెంట ఉన్నారు.

Total Page Visits: 34 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed