SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మృతుల కుటుంబాలను పరామర్శించిన జక్కంపూడి రాజా…

1 min read


నేల బావి ఘటనలో మృతిచెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా తెలిపారు

ఆదివారం నాడు కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామం నందు నేల బావి ఘటనలో మృతిచెందిన చిన్నారురుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రమాదకరమైన నేల బావులను గుర్తించి వాటిని పూడిచే విధంగా చర్యలు చేపడతామన్నారు.

ఇటువంటి హృదయ విధకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రమాద సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆయన వెంటనే కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

సంఘటన జరిగిన సమయంలో అమరావతిలో ఉండడం వల్ల నేను రాలేకపోయానని,స్థానిక నాయకులు సహకారంతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలను చేపట్టడం జరిగిందన్నారు.

ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో ఈ సంఘటనను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాయని, బాధిత కుటుంబాలను ఓదార్చివలసింది పొయ్యి విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిఎస్పి కడాలి వెంకటేశ్వరరావు,వైయస్సార్ సిపి నాయకులు నక్క రాంబాబు, పిట్ట కృష్ణ,కడవలి శివ తదితరులు పాల్గొన్నారు

Total Page Visits: 24 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed