SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మాస్కే ఆదాయవనరు

1 min read


కరోనా! గత రెండు సంవత్సరాలుగా ఏమంటూ ప్రపంచాన్ని కబళిస్తుందో కాని, ప్రపంచం లోని దేశదేశాలలో లక్షలాదిమంది మరణించారు.

కొందరి స్వార్ధం మరికొందరి పాలిట శాపంగా పరిణమించింది, మరికొందరికి వరమై నిలచింది. కులవృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయం మాయమైపోతున్న పరిస్థితులలో ఎన్నో కొత్త వస్తువుల ఆవిష్కరణలు మరెన్నో ఆరోగ్య రక్షణ కవచాలు పురుడు పోసుకొన్నాయి.
దేశదేశాలలో, మనదేశంలో కరోనా ఫస్ట్ వేవ్ అంటూ గత 2020 సంవత్సరం మాస్కులు, శానిటైజర్లు, హాండు వాష్, మౌత్ గార్గల్స్ లను బాగా ప్రచారం చేశారు. సరికొత్తగా ఉపయుక్తమంటూ ఉన్న మందులను విరివిగ వాడేశారు. దేశమంతా లాక్ డౌన్ విధించారు ఐనా మహమ్మారి కరోనా చాలా మందిని పొట్టనబెట్టుకొన్నది. ప్రభుత్వం మాస్కు ధారణే మీకు రక్షణ అంటూ డ్వాక్రా మహిళలచే మాస్కులు కుట్టించి ఒక నాలుగు చొప్పున ఇంటింటికి చేర్చింది. ఇళ్ల దగ్గర ఔత్సాహికులు మాస్కులు కుట్టడం ప్రారంభించారు, మిగిలిన వ్యాపారాలు కుదేలైనా ఇంటి ఖర్చులకు కాస్త చేదోడుగ రూపాయలను కూడబెట్టుకోన్నారు. ఇదో పెద్ద వ్యాపారమైపోయి నిట్టింగ్ కంపెనీలు సైతం మాస్కులను తయారు చేసి తమ బ్రాండ్ తొ పెద్ద ఎత్తున లాభాలు పొందాయి, పొందుచున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు సందట్లొ సడెమియా గా మ్యాచింగ్ మాస్కులను, కార్పోరేట్ సంస్థలు, సామాజిక సేవా సంస్థలు సైతం తమ లోగోతో మాస్కులను తయారు చేశారు. అర్ధరూపాయ్ నుండి వేల రూపాయల మాస్కులను మార్కెట్ చేస్తున్నారు. ఎవరూ ఎప్పుడూ పెద్దగ వాడని, వినని శానిటైజర్లను వందలాది కంపెనీలు తయారు చేస్తున్నాయి.

ప్రభుత్వాలకు ముందుచూపు లేక లాక్ డౌన్ ఎత్తివేశారు. కరోనా జాగ్రత్తలను పాటించని వారిని చూసి చూడకుండా ఉండటం వలన, జనం ఎక్కువగా ఒక్కచోట చేరు కార్యక్రమాలకు అనుమతులివ్వడం వలన అతి వేగంగా కరోనా వ్యాపించింది, ముందు సారి సూచించిన మందులు పనితీరు సరిపోక పోవడం, ఎంతో శ్రమకోర్చి తయారుచేసిన కరోనా వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు సంశయించడం, కరోనా జాగ్రత్తలను గాలికి వదిలేశారు. దాంతో ఈ 2021 సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ రాకతో జనం పిట్టల్లా రాలిపోయారు. రాష్ట్రాలు సన్నద్దంగా లేకపోవడం వలన ఆక్సిజన్ కొరత, హాస్పిటల్స్ దోపిడి, మరణించిన శరీరాలతో శ్మశానాల వద్ద క్యూ లైన్లు. రకరకాల మందులు వాడటం వలన సరికొత్త రోగాలు బ్లాక్, వైట్, యల్లో ఫంగస్ వ్యాధులు సోకి ప్రజలు బెంబెలెత్తి పోయారు. వివిధ దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరోనా వైరస్ రూపాంతరం చెంది విజృంభించడంతో రోజుకొక ప్రత్యేక వార్తను ప్రసారంచేస్తున్న ప్రసార మాధ్యమాలు. సంపూర్ణ లాక్ డౌన్ కాకుండా పాక్షికంగా కర్ఫ్యూ విధించినా కరోనా ఉధృతి ఆగని పరిస్థితి. కర్ఫ్యూతొ పేద మధ్య సన్నకారు వ్యాపారులు కుదేలైనారు. కుటుంబ పోషణకు సరియైన ఆదాయం లేక అన్నానికై అలమటించారు. బడా సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ వర్తకులు, పెద్దపెద్ద ఔషధ మాల్స్ వారు పెద్దఎత్తున ఆస్తులను సంపాదించగలిగారు. వర్తక వాణిద్య రవాణా సదుపాయాలు కొరవడి ప్రభుత్వాలకు ఆదాయం కుంటుపడింది. ఇక లాభం లేదని కర్ఫ్యూ సడలింపులు చేశారు. ప్రజలు మరల బయట ప్రపంచంలొనికి అడుగులు వేశారు. మరల అదే తంతు ఆరోగ్య రక్షణ జాగ్రత్తలను గాలికి వదిలేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తి నోరు కొట్టుకొని కరోనా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లు పొంచి ఉన్నాయని, జికా వైరస్ పొడ కనపడుతుందని, కరోనా మూడో వేవ్ దగ్గరలోనే ఉందని చెప్తున్నా పెడచెవిన పెట్టుచున్న ప్రజలు. “మాస్క్ మీకు రక్ష” అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. వాని అమలుకు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీలలో మాస్క్ పెట్టని వారిని కట్టడి చేయుటకు ప్రజలపై పెను భారాన్ని మోపు విధంగా పోలీస్ అధికారులను పురమాయించాయి.

ఇక్కడే “మాస్క్ ఆదాయవనరై కుర్చుంది”. పబ్లిక్ ప్లేస్ అంటూ కోనుగోలుదారులు లేని సమయంలో ఒంటరిగా షాపుల్లో కుర్చున్న వ్యాపారులను సైతం మాస్క్ పెట్టలేదని వంద రూపాయలను వసూలు చేస్తున్నారు. మంచినీరు త్రాగడానికో, మరేదైన కృత్యం తీర్చుకోవడానికో మాస్కు తొలగించినా పెనాల్టి విధించడం వలన అక్కడక్కడ వ్యాపారులు ఎందుకని ప్రశ్నించడం జరుగుచున్నది. వాదనలకు చోటు లభిస్తుంది. మీపై కేసులు పెడుతామని అధికారులు అనడం వలన, కొందరు పోలీసులని కిమ్మనకుండా డబ్బు చెల్లిస్తున్నారు.

కానీ రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొనే పబ్లిక్ ప్లేసులలో, బ్రాందీ షాపుల వద్ద మాస్కులు లేకుండా గుమిగూడు వారిని చూసినా కనపడనట్లు నటిస్తున్న అధికారులను కొందరు బాహాటంగానే మీకు “మాస్కే ఆదాయ వనరై” పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Also read

Total Page Visits: 25 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed