SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మానవత ఆధ్వర్యంలో కరోన హోమియో మందులు పంపిణి…

1 min read


పశ్చిమగోదావరి జిల్లా
ఆచంట…..

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఈ రోజు మానవత వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి సహకారంతో సుమారు 100 మందికి పైగా హోమియో కరోనా మందు పేకేట్ లను గ్రామస్తులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పంపిణి చేశారు.ఈ నెలలో ఇప్పటివరకూ సుమారు 200 ప్యాకెట్లలో హోమియోపతి కరోనా మందు పంపిణీ చేశామని మానవత అధ్యక్షుడు కడలి సుబ్రహ్మణ్యం తెలిపారు…కోవిడ్ తీవ్రత వలన అంబులెన్స్ ల మాఫియాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కేవలం నామమాత్రపు ఖర్చులతో పేషెంట్లను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించడానికి దాతల సహకారంతో అత్యాధునిక అంబులెన్స్ ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.ఇదేకాక మార్టేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆమారు 60 సంజీవిని మొక్కలను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మానవత మూర్తులు వారాది రమణ,బండారు గుప్తా,కర్రి. బ్రహ్మరెడ్డి,దొంగ జయదుర్గాప్రసాద్,కర్రి కృష్ణారెడ్డి.గుత్తుల సాల్మన్ దొర,బండి ప్రసాద్,ఉండవల్లి భూషణం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్…
కిరణ్ కుమార్.వి
పశ్చిమగోదావరి జిల్లా
నర్సాపురం పి.సి

Also read

Total Page Visits: 76 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed