SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు 43 కోట్ల 23 లక్షల రూపాయల మంజూరు !!

1 min read


మచిలీపట్నం : జూలై 5 , 2021

మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు 43 కోట్ల 23 లక్షల రూపాయల మంజూరు !!
—– మంత్రి పేర్ని నాని

వివిధ అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతిని ఇస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు 43 కోట్ల 23 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం ఎంతో శుభ పరిణామమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ , ఈ నిధుల విడుదలతో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యలు ఇక తొలిగిపోనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ నీటి సరఫరా పథకం నిధుల విడుదల కేవలం ఇప్పటివరకు మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మంజూరు విషయమై పరిగణించిందని ఆయన వివరించారు. చారిత్రాత్మక మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ 26.67 కి.మీ విస్తీర్ణంలో నేడు విస్తరించి ఉందని, ఆంగ్లేయుల కాలంలోనే (1866 సంవత్సరంలో) మునిసిపాలిటీగా ఏర్పడిన మచిలీపట్నం పురపాలక సంస్థ 149 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం 2015 డిసెంబర్ 9 న ప్రత్యేక గ్రేడ్ మునిసిపాలిటీ నుండి కార్పొరేషన్‌కు అప్‌గ్రేడ్ చేయబడిందన్నారు. కాగా సోమవారం తాడేపల్లిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (పిహెచ్), మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ (బడ్జెట్) విభాగం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 335 ద్వారా ఈ క్రింది పనులకు అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి లభించిందని మంత్రి చెప్పారు.
మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ .45.23 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రదేశాలలో 11 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణాల నిమిత్తం 2305 లక్షల రూపాయలు ,అలాగే వివిధ ప్రాంతాలలోని రిజర్వాయర్లకు అత్యధిక నీటి పీడనాన్ని సమర్థవంతంగా తట్టుకొనే డి 1 కె 9 పైప్ లైన్ల ఏర్పాటు తద్వారా శుద్ధమైన తాగునీటిని పంపింగ్ మెయిన్స్ అందించడం కోసం 1188 లక్షలు, అలాగే వివిధ నీటి సరఫరా పంపిణీ వ్య్వవస్థ ద్వారా జలాశయాలు అందించడం కోసం 6 లక్షల రూపాయలను అంచనాఅంచనాలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం, ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, మచిలిపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్ పరిధిలో పైన పేర్కొన్న పనులను చేపట్టడానికి రూ .45,23,00,000- (నలభై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలు ) పరిపాలనా అనుమతి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన సమాచారమని మంత్రి వివరించారు. .
——————————
ఉప సంచాలకులు , కృష్ణాజిల్లా సమాచార , పౌర సంబంధాల శాఖ మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది.

Total Page Visits: 53 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed