SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

భర్త స్నేహితురాలిపై సెక్షన్‌ 498ఎ చెల్లదు : హైకోర్టు

1 min read

అమరావతి : ఓ దిశ కేసుకు సంబంధించి భర్త స్నేహితురాలిపై సెక్షన్‌ 498 ఎ చెల్లబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కలిగిఉందంటూ ఓ మహిళపై నెల్లూరు జిల్లా దిశ పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత కె.సునీత ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్‌ 498ఎ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన భర్తను మొదటి నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దిశ పోలీసులు సెక్షన్‌ 498ఎ కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నిందితురాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు పిటిషనర్‌ ఏవిధంగాను బంధువు కాదన్నారు. పిటిషనర్‌పై పోలీసులు సెక్షన్‌ 498 ఎ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని వాదించారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్‌ మానవేంద్రనాథ్‌ రారు పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు. ”భర్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిపై మాత్రమే ఐపిసి సెక్షన్‌ 498ఎ చెల్లుబాటు అవుతుంది. భర్త స్నేహితురాలిపై, వివాహేతర సంబంధాన్ని కలిగిన మహిళపై సంబంధిత సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదు” అని స్పష్టం చేశారు. వ్యాజ్యంలో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తిపై విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

Also read

Total Page Visits: 138 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed