SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రైవేటు టీచర్ల ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి లక్ష ఉత్తరాల అభ్యర్థన కార్యక్రమం

1 min read

పీలేరు, జూలై 19; సుమారు సంవత్సరంన్నర కాలం నుంచి కరుణ వైరస్ వల్ల విద్యాసంస్థలు మూసి వేయడం వల్ల లక్షల మంది ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ ఉపాధిని కోల్పోయారు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
చాలామంది కుటుంబాలను పోషించుకోవడం కోసం కూలి పనులు చేస్తున్నారు మరి కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ప్రైవేటు ఉపాధ్యాయునికి ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరం.
చట్టప్రకారం యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కానీ చెల్లించడం లేదు, దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ప్రైవేటు టీచర్లు స్థితిగతులు మారుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ నియమించి చేతులు దులుపుకుంది. ఆ కమిషన్ ఇప్పటివరకు ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు సమస్యలను పరిష్కరించక పోగా ఈ కరోనా కాలంలో సిబ్బందికి జీతాలు ఇప్పించ లేకపోయింది.
దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కలిసి తమ సమస్యలను పరిష్కరించమని మరియు పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు తెరిచే వరకు సిబ్బందికి నెలకు ఐదు వేల రూపాయలు మరియు నిత్యవసర వస్తువుల ద్వారా ఆర్థిక సహాయం చేయాలని..ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ న్యాయం చేయాలని అని రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేద్కర్ గారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు పఠాన్ నౌషాద్ ఖాన్, చిత్తూరు జిల్లా ట్రెజరర్ ప్రభాకర్, చిత్తూరు జిల్లా ఉమెన్ సెక్రెటరీ సుహాసిని, పీలేరు నియోజకవర్గం వుమెన్ కన్వీనర్ హేమలత, మరియు పి టి ఎల్ యు నాయకులు పాల్గొనడం జరిగింది.

Also read

Total Page Visits: 28 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed