SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రశ్నిస్తే కేసులా….

1 min read



ఇరగవరం మండలం అర్జునుడు పాలెం గ్రామపంచాయతీ లో జరిగిన రైతుదినోత్సవంలో తమకు న్యాయం చేయాలని కోరిన రైతును నానా దుర్భాషలాడిన తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి వేంకట నాగేశ్వరరావు క్షమాపణ చెప్పాలని అలాగే రైతులకు ధాన్యం డబ్బులు తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇరగవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందచేసినందుకు మాపై కేసులు పెట్టడం సరికాదని జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకుడు అనుకుల రమేష్ అన్నారు. అర్జనుడిపాలెం గ్రామంలో జరిగిన రైతుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి ప్రజాఉద్యమాన్ని అణచలేరని తెలియజేశారు. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వమని అడిగితే ఈ విధంగా కక్షపూరితంగా నాపై అలాగే అర్జనుడిపాలెం గ్రామ ప్రెసిడెంట్ పోతుల గంగాధరం మరియు రైతులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.రాజ్యాంగం చట్టం కారుమూరికి ఒకలాగా మాకు ఒకలాగా ఉండదని ఒకవేళ మేము కరోనా రూల్ అతిక్రమిస్తే మరి కారుమూరి అర్జనుడిపాలెం లో 500 మందితో గ్రామ సభ పెట్టినందుకు ఆయనపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయాలని తెలియచేశారు. రేపు ఆదివారం తణుకు పట్టణంలో రైతుల సమస్యలపై అన్ని పార్టీలతో కలసి అఖిలపక్షం మీటింగ్ నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రమేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోతుల గంగాధరం ఇరగవరం రైతులు పాల్గొన్నారు

Read also

Total Page Visits: 150 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed