SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రభుత్వ దుకాణంలో చోరీ.. తరలిస్తుండగా ప్రమాదానికి గురైన కారు

1 min read


రూ.2 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
నడకుదురు (కరప),: కరపలోని ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో శనివారం రాత్రి కొంతమంది నిందితులు చొరబడి రూ.2 లక్షల విలువైన మద్యాన్ని చోరీ చేశారు. అయితే మద్యాన్ని తరలిస్తున్న కారు అనుకోకుండా నడకుదురులో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో విషయం వెలుగుచూసింది. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మిత్రాగార్డెన్‌ దుకాణంలో ప్రభుత్వం మద్యంషాపును నిర్వహిస్తోంది. కర్ఫ్యూ నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు సిబ్బంది షాపును మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకుగాని సెక్యూరిటీగార్డు రాడన్న విషయాన్ని పసిగట్టిన కొంతమంది చీకటిపడ్డాక కారులో ఆ షాపు వద్దకు చేరుకున్నారు. షాపు వెనుక ఉన్న సిమెంట్‌ ఇటుకల గోడకు నేర్పుగా కన్నం పెట్టి మద్యంషాపులోకి చొరబడ్డారు. షాపులో ఉన్న మద్యం కేసులను బయటకు తీసి కారులోకి ఎక్కించారు. అనంతరం దుండగులు కారులో కాకినాడ వైపు వేగంగా బయలుదేరారు. నడకుదురు వచ్చేసరికి డ్రైవర్‌ కంగారులో రోడ్డుపక్కనే ఉన్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు బోల్లాపడి కొంత మద్యం నేలపాలైంది. ఈ హఠాత్పరిణామంతో భీతిల్లిన నిందితులు కారులో నుంచి ఎలాగో బయటపడి పరారయ్యారు. జరిగిన ఘటనపై స్థానికులు కరప పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ రూర ల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, కరప ఎస్‌ఐ రమే్‌షబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారించా రు. నిందితులు చోరీచేసిన మద్యాన్ని ఆటోలో కరప పోలీ్‌సస్టేషన్‌కు తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. మద్యంషాపులో పనిచేస్తున్న సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Total Page Visits: 78 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed