SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ అప్పీళ్లను ప్రత్యేక కోర్టు విచారించవచ్చా?

1 min read

అమరావతి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై కేసుల విషయంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వారు దాఖలు చేసిన క్రిమినల్‌ అప్పీళ్లపై.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు విచారణాధికార పరిధి ఉంటుందో లేదో హైకోర్టు తేల్చనుంది. ఈ విషయంపై శుక్రవారం ప్రాథమిక విచారణ జరిగింది. కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, కేసుకు సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేసి రావాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డికి సూచించింది.

విచారణను ఈ నెల 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఆదేశాలిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. మరోవైపు.. 2008,11,14 సంవత్సరాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దిగువ కోర్టులు విచారణ పూర్తి చేసి తీర్పులు వెల్లడించాయి. వాటిపై క్రిమినల్‌ అప్పీళ్లు దాఖలై ఉన్నాయి. కాగా.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నిటినీ ప్రత్యేక కోర్టుకు పంపించాలని హైకోర్టు సర్క్యులర్‌ జారీ చేయడంతో సెషన్స్‌ కోర్టుల్లో ఉన్న అప్పీళ్లు కూడా విజయవాడ ప్రత్యేక కోర్టుకు చేరాయి. ఈ అప్పీళ్లను విచారించే పరిధిపై సందేహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూరి.్త.. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జికి లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. శుక్రవారం వ్యాజ్యం విచారణకు రాగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్‌ అప్పీళ్లను విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు లేదని, సెషన్స్‌ కోర్టు మాత్రమే విచారించగలదని తెలిపారు

Total Page Visits: 55 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed