SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పోలవరం ప్రాజెక్ట్ తనిఖీ..జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జూలై 19

రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో ముందస్తు ఏర్పాట్లను

సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా

తెలిపారు. శనివారం అధికారులతో కలిసి హెలిప్యాడ్.

పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా

కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యటించారు.

ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ పై చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో, పోలీసు అధికారులతో పర్యటన, భద్రత చర్య లపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనలు చేశారు. ప్రాజెక్ట్ ఇంజినీర్, రెవెన్యూ, ఆర్ అండ్ బి ఇరిగేషన్, పోలీస్ తదితరశాఖల అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భద్రత ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.

అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక 2 వేల కిట్స్ ఏర్పాటు చేసి, శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో శానిటైజెషన్ చెయ్యాలని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్య మంత్రి సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ నుంచి ఉ.10.10 కి బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని హెలిప్యాడ్ కు ఉ.11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి, కాపర్ డ్యామ్, తదితర (Sluice gates copper dam) ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు.



తదుపరి అక్కడ నుంచి ఉ.11.50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరంకు మ.12.00 కి చేరుకుని మ.1.00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం. పోలవరంలోని సమావేశ మందిరం నుంచి మ. 1.10 బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని ము.1.20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంకు చేరుకుంటారన్నారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అంతకుముందు పోలీసు అధికారులకు చేపట్టే భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏఎస్ఎల్ లో కలెక్టర్, ఎసీతో పాటు పోలవరం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్/ ఇంఛార్జి పేట ఐటీడీఏ ఓ.ఆనంద్, ఇరిగేషన్ ఎస్సి కె. నరసింహ మూర్తి, పోలవరం ప్రాజెక్ట్ సి.ఈ. సుధాకర్ బాబు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో వైవి.ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ కె.లతా కుమారి. మేఘా ఇంజనీరింగ్ జీఎం ముద్దు కృష్ణ, మేనేజర్ మురళి. అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Also read

Total Page Visits: 42 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed