SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పిడుగురాళ్ల పరిసర గ్రామాల్లో లీగల్ మెట్రాలజి కమిషనర్ ఆకస్మిక దాడులు

1 min read


ఈరోజు పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామానికి లీగల్ మెట్రాలజీ కమిషనర్ అల్లూరయ్య తన యొక్క విధుల్లో భాగంగా జానపాడు గ్రామం లూథరన్ చర్చి వెనుక భాగంలో ఉన్నటువంటి శ్యామ్ కిరానా అండ్ ఫ్యాన్సీ షాప్ ని సందర్శించారు. వారు అధిక ధరలకు అమ్మడo గ్రహించి కటా తూకం లో కూడా పెద్ద మొత్తంలో ప్రజల్ని మోసం చేస్తున్నారని గ్రహించి. వారిపై కేసు నమోదు చేసి కాటా తూ కాన్ని వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసే ప్రతి ఒక్క వినియోగదారుడు వస్తువు ధర మరియు నాణ్యత చూసుకోవాలని 100 రూపాయలకు మించితే అడిగి జిఎస్టి బిల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరు ప్రశ్నించేవారు గా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారి సునీల్ మరియు మీడియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


నాసిరకం వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్న వాయుపుత్ర సెలక్షన్స్

ఈరోజు పిడుగురాళ్ల జాన పాడు రోడ్ లో ఉన్న వాయుపుత్ర సెలక్షన్స్ ని లీగల్ మెట్రాలజీ కమిషనర్ అల్లూరయ్య తన యొక్క విధుల్లో భాగంగా సందర్శించారు షాప్ లో ఉన్నటువంటి అన్ని వస్తువుల తనిఖీ చేసి కొన్ని నాసిరకం వస్తువులు బ్రాండెడ్ అని అధిక ధరలకు అమ్మడం గ్రహించి రెండు కేసులు రాయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాసిరకం వస్తువులు మరియు MRP కంటే అధిక ధరలకు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. కొ న్నటువంటి ప్రతి వస్తువు కి వినియోగదారుడు అడిగి జిఎస్టి బిల్లు తీసుకోవాలని వస్తువుల నాణ్యత లోపిస్తే కన్జ్యూమర్ కోర్ట్ కి వెళ్ళ వచ్చని, యాజమాన్యం కస్టమర్లనే దేవుళ్లు గా భావించి గౌరవించాలని షాపు యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు గా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారి సునీల్, తదితరులు పాల్గొన్నారు

*నందిధాత్రిక పత్రికలో వచ్చిన వార్తకు స్పందన వాయుపుత్ర సెలక్షన్స్ లో అధికారుల తనిఖీలు*


పిడుగురాళ్ల జూలై 2 ( నందిధాత్రిక ) పిడుగురాళ్ల పట్టణంలో ని జానపాడు రోడ్ లో ఉన్న వాయుపుత్ర సెలక్షన్స్ షాపులో బ్రాండెడ్ వస్తువులని అధిక ధరలకు అమ్ముతున్నారని ,కొన్ని వస్తువులకు నాణ్యత లోపాలు సరైన అడ్రస్ లు ఇన్ఫర్మేషన్ లేకుండా తేడాలు ఉన్నాయని,కొన్ని వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని,వినియోగదారుడు కొన్న వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదని అదేమమని అడిగిన వారిపై దురుసుగా సమాధానం చెబుతున్నారని నందిధాత్రిక దిన పత్రికలో వార్త ప్రచురితమైనవిది .స్పందించిన అధికారులు లీగల్ మెట్రాలజీ కమిషనర్ అల్లూరయ్య తన యొక్క విధుల్లో భాగంగా షాపును సందర్శించారు. షాపులో ఉన్నటువంటి అన్ని వస్తువులను తనిఖీ చేసి కొన్ని నాసిరకం వస్తువులు బ్రాండెడ్ అని అధిక ధరలకు అమ్మడం గ్రహించిన అధికారులు రెండు కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాసిరకం వస్తువులు మరియు ఎమ్ఆర్పి కంటే అధిక ధరలకు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నటువంటి ప్రతి వస్తువుకు వినియోగదారుడు అడిగి జిఎస్టి బిల్లు తీసుకోవాలని వస్తువుల నాణ్యత లోపిస్తే కన్జ్యూమర్ కోర్ట్ కి వెళ్ళ వచ్చని, యాజమాన్యం కస్టమర్లనే దేవుళ్లు గా భావించి గౌరవించాలని షాపు యాజమాన్యాన్ని హెచ్చరించినట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.

Total Page Visits: 81 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed