SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నిడదవోలు పురపాలక సంఘం లో బాలరాజు రెండవ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం లో యలగాడ బాలరాజు రెండవ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈయన ఎన్నికకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఎక్స్ అఫీషియో మెంబర్ గా హాజరయ్యి మిగిలిన కౌన్సిలర్ల తో పాటు బాలరాజు ఎన్నికకు ఏకగ్రీవంగా చేయి ఎత్తి ఆమోదం తెలిపారు. బాలరాజు 2014 సంవత్సరం లో వైసీపీ తరుపున కౌన్సిలర్గా గెలుపొందారు. రెండోసారి కూడా ఈ ఎన్నికలలో 13వ వార్డు నుండి ఎన్నికై వైస్ చైర్మన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిందని దీనికి నిదర్శనమే ఈ రోజు పురపాలక సంఘం లో మొదటి వైస్ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన గంగుల వెంకటలక్ష్మి ఏకగ్రీవం కాగా అదేవిధంగా ఈ రోజు రెండవ వైస్ చైర్మన్ గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలరాజును ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజులలో
నిడదవోలు మున్సిపాలిటీ ను ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

Also read

Total Page Visits: 201 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed