SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నాలుగు రోజులుగా అర్ధరాత్రి
చక్కర్లు.. ఏం జరుగుతోంది?

1 min read

శ్రీశైలంలో డ్రోన్ల కలకలం

నాలుగు రోజులుగా అర్ధరాత్రి
చక్కర్లు.. ఏం జరుగుతోంది?

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి.

నాలుగు రోజులుగా
అర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది.

రాత్రివేళల్లో డ్రోన్లు తిరగడం అనుమానాలురేకెత్తిస్తోంది.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో
అధికారులు అప్రమత్తమయ్యారు.

శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల ముఠా పని అయి ఉంటుందా? అనే కోణాల్లో విచారణ
జరుపుతున్నారు.

డ్రోన్లు తిరుగుతున్న సమయంలో పట్టుకునేందుకు దేవస్థానం, భద్రతా సిబ్బంది
ప్రయత్నించినా దొరకలేదు.

ఆకాశంలో బాగా
ఎత్తుగా.. వేగంగా ఎగిరిపోతుండడంతో
పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.

గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు..

Total Page Visits: 49 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed