SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దేవినేని పై దాడి హేయమైన చర్య — తోట సీతారామలక్ష్మి.

1 min read

అధికారంలోకి వస్తే ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పి గద్దెనెక్కిన వైసీపీ నేతలు అధికారం వచ్చేక పంచభూతాలు పంచుకుంటున్నారని అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ అక్రమ కేసులతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వ్యాఖ్యానించారు. ఈరోజు వారి కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమనుగా గ్రామం ఫారెస్ట్ లో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ వెలికితీసేందుకు వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దేవినేని పై దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు హత్యాయత్నం కేసు ఏవిధంగా పెడతారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడి చేయడం నీతిమాలిన చర్య అని వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడి కేసులు పెట్టడం దినచర్యగా మారిందని విమర్శించారు.మాజీ మంత్రికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఈ ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి చేతకాని పాలనతో భవిష్యత్తులో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని వైసీపీ నేతలు కార్యకర్తలకు స్పష్టంగా అర్థమయ్యే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే అధికారం ఉండగానే అందినకాడికి దోచుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న అవినీతిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే రాష్ట్ర ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.
— నరసాపురం పార్లమెంట్ టిడిపి కార్యాలయం. భీమవరం.

Also read

Total Page Visits: 80 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed