SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దేవినేని ఉమా అరెస్ట్ వ్యవహారంలో ఐపీఎస్ స్థాయి అధికారులే దిగజారి మాట్లాడుతున్నారు.

1 min read

*అమరావతి (కృష్ణా జిల్లా/మైలవరం)*

_*మాజీ శాసనసభ్యులు, సంగం డైరీ ఛైర్మన్, శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విలేకరుల సమావేశం వివరాలు..*_



*దేవినేని ఉమాపై దాడి ఘటనలో రక్షకభటులే భక్షకుల్లా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండీ మరీ మాజీమంత్రిపై అధికారపార్టీవారితో దాడిచేయిస్తే, డీఐజీ ఎస్పీలు ఏమీ తెలియనట్లు చిలుకపలుకులు పలుకుతున్నారు.*

*- దేవినేని ఉమా అరెస్ట్ వ్యవహారంలో ఐపీఎస్ స్థాయి అధికారులే దిగజారి మాట్లాడుతున్నారు.*

*- కృష్ణాజిల్లా ఎస్పీ, దేవినేని అరెస్ట్ వ్యవహారంలో నిష్పాక్షికవిచారణ జరుపుతామంటున్నారు.*

*- ఆయనచెప్పేది రాష్ట్రంలోఎక్కడైనా అమలైందా?*

*- కొండపల్లి ఫారెస్ట్ లో మైనింగ్ పరిశీలించి తిరిగొస్తున్న దేవినేనిఉమాను, ఇతర టీడీపీనేతలు, విలేకరులను వేరేదారిలో వెళ్లమనిచెప్పింద కానిస్టేబుళ్లుకాదా?*

*- జీ కొండూరు జంక్షన్ వద్దకువెళ్లాక మరలా దేవినేనిఉమాని దారిమళ్లించింది స్థానికఎస్సై కాదా?*

*- వైసీపీ గూండాలకు పోలీసులే సమాచారమిచ్చి, దేవినేనిఉమాపై దాడిజరిగేలా చేశారనడానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది?*

*- పోలీస్ యంత్రాంగమే అధికారపార్టీ కి కొమ్ముకాసి, వైసీపీ గూండాలు, కార్య కర్తలు టీడీపీవారిపై దాడిచేసేలా ప్రోత్సహించింది.*

*- ఇవేవీ తమకు తెలియనట్లు డీఐజీ కృష్ణజిల్లా ఎస్పీ చిలుకపలుకులు పలుకుతున్నారు.*

*- దేవినేని ఉమా కారులోనుంచి కిందికే దిగనప్పుడు ఆయన వేరేవ్యక్తిపై ఎలా దాడిచేస్తాడు?*

*- ఆయనకారులోనుంచి దిగకపోవడంతో పోలీసులు కారు అద్దాలు పగలగొట్టి, ఆయన్ని అరెస్ట్ చేశామన్నది నిజంకాదా?*

★ దేవినేని ఉమాపై దాడి, తరువాతజరిగిన ఆయన అరెస్ట్ వ్యవహారంలో ఐపీఎస్ స్థాయి డీఐజీ అధికారి మాటలువింటుంటే, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలాఉందో అర్థమవుతోందని, అధికారపార్టీ వారికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో స్పష్టమవుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

★ బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

_*ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!*_

★ దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీగూండాలు దాడిచేయడం, పోలీసులు ఆయనపై తప్పుడుకేసులుపెట్టి, అరెస్ట్ చేసిన వ్యవహరాంలో ఎవరో ఒక ఎస్సై స్థాయి అధికారి, దేనికో కక్కుర్తిపడి దిగజారిపోయాడంటే అర్థముంది.

★ కానీ ఐపీఎస్ స్థాయిలోఉన్న డీఐజీ మాట్లాడుతూ, దేవినేని ఉమామహేశ్వరరావు గారే అలర్లకు, గొడవకు కారణమని, ఆయనేఅక్కడున్నవారిని రెచ్చగొట్టాడని చెప్పారు.

★ డీఐజీ మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే కృష్ణాజిల్లా ఎస్పీకూడా ఉన్నారు.

★ ఎస్పీమాట్లాడుతూ, నిష్పక్షపాతంగా, నిర్భయంగా విచారణజరుపుతామన్నారు.

★ అసలు ఈరాష్ట్రంలో అది సాధ్యమేనా అన్నది నాతోపాటు, ప్రతిఒక్కరి సందేహం.

★ మాజీమంత్రి దేవి నేని ఉమాపై కేసులుపెట్టడమే అరాచకం.

★ నిన్న సాయంత్రం 03.30ని.లకు దేవినేనిఉమా కొండపల్లి పార్టీ కార్యాలయం లో టీడీపీసమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.

★ సమావేశంలో నియోజకవర్గస్థాయి నేతలతో చర్చిస్తున్నసమయంలోనే కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్నఅక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నేతలు దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లారు.

★ అక్రమ మైనింగ్ వల్ల కొండపల్లి బొమ్మలతయారీకి అవసరమైన కొన్నిచెట్లను దారుణంగా నరికేస్తున్నారని కూడా నేతలు చర్చించు కున్నారు.

★ సమావేశం ముగిశాక 04.30ని.లకు కొండపల్లి అటవీప్రాంతంలో జరుగుతున్నమైనింగ్ ను పరిశీలించడానికి దేవినేనిఉమా, మరికొందరు బయలుదేరారు.

★ 04.55 ని.లకు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లారు. దేవినేనిఉమాతోపాటు, పత్రికలు, ఛానళ్లకు సంబంధించిన విలేకరులుకూడా ఉన్నారు.

★ దేవినేనిఉమా, ఇతరనేతలందరూ కలిసి దాదాపు గంటన్నరపాటు అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని మీడియాద్వారా అందరికీ తెలిసేలాచేశారు.

★ తిరిగి సాయంత్రం 6 గంటలతర్వాత అందరూ బయలుదేరారు.

★ రిజర్వ్ ఫారెస్ట్ లోనుంచి దేవినేని ఉమా, టీడీపీనేతలు బయలుదేరాక, ఇద్దరు కానిస్టేబుళ్లు వారివద్దకొచ్చి, మీరువచ్చిన దారిలో కాకుండా వేరేదారిలో వెళ్లాలనిచెప్పి, వారిని దగ్గరుండిమరీ దారిమళ్లించింది వాస్తవమా..కాదా?

★ దేవినేనిఉమా, ఇతర టీడీపీనేతలు, విలేకరులతోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లుకూడా కొంతదూరం వెళ్లింది నిజమా..కాదా?

★ ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి దేవినేని ఉమాని ఇతరులను తీసుకొచ్చి, జీ. కొండూరు వైపు వెళ్లమని చెప్పారు.

★ కానీ జంక్షన్లోఉన్న ఎస్సై , జీ.కొండూరువెపువెళితే, అక్కడకూడా వైసీపీకార్యకర్తలు ఉన్నారు, కాబట్టి మీరంతా గడ్డమడుగు వైపువెళ్లమని దేవినేని ఉమాతో, ఇతరులతో చెప్పింది వాస్తవమా కాదా?

★ ఎస్సై చెప్పినవైపు వెళ్లాకే దేవినేనిఉమా, ఇతర టీడీపీనేతల పై వైసీపీ గూండాలు దాడిచేశారు.

★ ఇదంతా ఒకప్లాన్ ప్రకారమే జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనంఏం కావాలి?

★ గడ్డ మడుగు వెపువెళ్లమని స్థానికఎస్సై చెప్పడం, పథకంలో భాగంగా జరిగిందో లేదో ఎస్పీ, డీఐజీ చెప్పాలి.

★ వాస్తవాలు అలా ఉంటే, ఐపీఎస్ స్థాయి అధికారులు వాటిని వక్రకరించే లా మాట్లాడటంఏమిటి?

★ దేవినేనిఉమాపై దాడిజరిగిన ప్రాంతం కచ్చితంగా జీ.కొండూరు పోలీస్ స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనేఉంది.

★ అదనపు బలగాలను రప్పిం చడానికిగానీ, వైసీపీకార్యకర్తలు జీ.కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడటానికిగానీ ఎంతసేపుపడుతుంది?

★ వైసీపీ కార్యకర్తలు స్టేషన్ చుట్టపక్కలకువచ్చేవరకు పోలీస్ యంత్రాంగం ఏంచేసింది?

★ పోలీస్ యంత్రాంగమే అధికారపార్టీ కి కొమ్ముకాసి, అధికారపార్టీకి చెందిన గూండాలు, కార్యకర్తలు టీడీపీవారిపై దాడిచేసేలా ప్రోత్సహించింది.

★ ఇదంతా వాస్తవమో కాదో కృష్ణాజిల్లా ఎస్పీ సమాధానంచెప్పాలి.

★ దేవినేని ఉమాని దారిమళ్లించింది పోలీసులుకాదా?

★ ఇవేవీ తనకు తెలియనట్లు డీఐజీ చిలుకపలుకులు పలుకుతున్నాడు.

★ వైసీపీ కార్యకర్తలు జీ.కొండూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరడానికి పోలీసులేకారణం.

★ దేవినేనిఉమా కారులోనుంచి దిగకుండా కూర్చుంటే, ఆయనపై దాడిచేసిందికూడా వైసీపీ కార్యకర్తలే.

★ కారులోనుంచి దిగనివ్యక్తి, ఎలా రెచ్చగొడతాడో జిల్లాఎస్పీనే సమాధానంచెప్పాలి.

★ రక్షకులే భక్షకులైతే, అసాంఘికశక్తులనుకట్టడిచేయాల్సిన పోలీస్ యంత్రాంగమే దుర్మార్గులకు మద్ధతుగా నిలిస్తే, ప్రజలకు, ప్రతిపక్షపార్టీ నేతలకు రక్షణ ఉంటుందా?

★ తనపై జీ.కొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో దాడిజరిగింది కాబట్టి, తానుఅక్కడే ఫిర్యా దుచేస్తానని దేవినేని ఉమా అన్నారు.

★ మాజీమంత్రిగా పనిచే సిన వ్యక్తి ఫిర్యాదుచేస్తానంటే ఆయన ఫిర్యాదు తీసుకోరా?

★ ఆయన్ని పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా నిరోధించి, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు, కేసులున్నీ పెట్టారు.

★ దేవినేని ఉమా కారులోనుంచి దిగలేదు..కనీసం కారుఅద్దాలుకూడా తీయ లేదు.

★ అలాంటప్పుడు ఆయన వేరేవ్యక్తిపై దాడిచేశాడని ఎలా కేసుపెడతారు?

★ చివరకు పోలీస్ యంత్రాంగం క్రేన్ సాయంతో ఆయన కారుని తీసుకెళ్లడానికి ప్రయత్నించింది.

★ ప్రజలకోసం పనిచేయాల్సిన పోలీస్ యంత్రాంగం అరాచక శక్తులతో అంటకాగుతోంది.

★ మాజీమంత్రి ఫిర్యాదుచేయలేని స్థితిలో ఉన్నారంటే, రాష్ట్రంలోని శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు.

★ పోలీసులే ప్రత్యక్ష్యంగా దగ్గరుండి మరీ భౌతికదాడులను ప్రోత్సహిస్తున్నారు.

★ ఐపీఎస్ స్థాయి అధికారులేమో ఏమీతెలియనట్లే చిలుకపలు కులుపలుకుతున్నారు.

★ పోలీసులు చెబితేనే దేవినేని ఉమా తాను వెళ్లాలనుకున్నదారిలో కాకుండా, గద్దమడుకువైపు వెళ్లారు.

★ దేవినేని ఉమా వెళ్లేదారిగురించి అధికారపార్టీ వారికి సమాచారమిచ్చింది పోలీసులే.

★ వారే సమాచారమిచ్చి వారే దాడిజరిగేలాచేశారు.

★ దేవినేని ఉమా తనపైదాడిచేశాడని ఫిర్యాదుచేసినవ్యక్తి అక్కడివాడుకాడు. అతనిది ఇబ్రహీంపట్నం మండలం. ఆయన ఇబ్రహీంపట్నం మండలానికే చెందిన వైసీపీనేతకారుకి డ్రైవర్ గా వెళ్లారు.

★ ఇబ్రహీంపట్నం మండలానికి చెందినవ్యక్తి ఏదో ఫిర్యాదుచేయాలి కాబట్టి చేశాడు.

★ అసలు అతను జీ.కొండూరు మండలానికి ఎందుకువెళ్లాడు.

★ కేవలం దేవినేనిఉమాపై దాడిచేయడానికే వారు అక్కడికి వెళ్లారు అని ప్రత్యక్షసాక్షులేచెప్పారు.

★ సంబంధం లేని వ్యక్తులు, సంబంధంలేని మండలంలోనికి వెళ్లి దాడిచేసేలా చేసింది పోలీసులే.

★ కాబట్టి దేవినేని ఉమాపై జరిగినదాడి లో పోలీసులపాత్ర చాలాస్పష్టంగా ఉందని తేలిపోయింది.

★ పోలీసులే అధికారపార్టీకి అండగా ఉండి, ప్రతిపక్షనేతలపై దాడులకు సహకరిస్తున్నారు.

★ అలాంటి పోలీసులపై ఎవరికి ఫిర్యాదుచేయాలో, ఏఫోరంలో ఫిర్యాదుచేయాలో అక్కడే చేస్తాము.

★ అక్రమమైనింగ్ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన దేవినేనిఉమాని అరెస్ట్ చేయించినంతమాత్రాన అక్కడ జరిగే మైనింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుందని భావించకండి.

★ దేవినేనిఉమాపై ఎస్సీ,ఎస్టీ చట్టంకింద కేసులు పెట్ట డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

★ ఏ కేసులో అరెస్ట్ చేసినా, దేవినేని ఉమాని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, పోలీస్ స్టేషన్లలోనే ఎందుకుంచారు?

★ ఏ కేసులుపెట్టాలి..ఎలా ఇరికించాలనే పథకరచన చేయడానికే తెల్లారేవరకు పోలీసులు పథకరచన చేశారా?

★ పోలీసులే కారుఅద్దాలు పగులగొట్టి దేవినేని ఉమాని అరెస్ట్ చేయడమేంటి?

★ ఏపీలో పోలీసులు చేస్తున్నఅరాచకాలు సినిమాల్లోని ఘటనలనుకూడా మించి పోయాయి.

★ దాడిలో పోలీసులప్రమేయం ఉంది. పోలీసుల సహాయసహకారాలతోనే వైసీపీగూండాలు దేవినేని ఉమాపై దాడిచేశారని సుస్పష్టమవుతోంది.

★ సాయంత్రం 6.30 ని.ల నుంచి రాత్రి 9.30 ని.లవరకు దేవినేనిపై దాడి, ఇతరత్రా అరాచకం నడుస్తుంటే, పోలీసులు ఆయనపైనే కేసులు పెట్ట డమేంటి?

★ రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రజలకు,మాకునమ్మకం లేదు. కాబట్టి ఈ వ్యవహారంలో, పోలీసుల పాత్రపై రాష్ట్రేతర సంస్థలతో విచారణ జరిపించాలి.

★ బయటి సంస్థలైతేనే కొంతలో కొంతఏపీ పోలీసు అధికారులకు శిక్ష పడుతుంది.

★ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. అందులో ఎలాంటి సందేహంలేదు.

★ అరాచకమే రాజ్యమేలు తున్నప్పుడు, ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షనేతలను నిర్బంధించి, దానిద్వారా సదరుగొంతులు నొక్కేయవచ్చను కుంటే అదిచాలాపెద్దపొరపాటు.

★ గతంలో బీజేపీ వారిని, జనసేన నేతలనుకూడా ఇలానే తప్పుడుకేసులతో వేధించారు.

★ ఇలాంటి చర్యలు పాలకుల అంతానికి మొదలు మాత్రమే.

★ దేవినేని ఉమామహేశ్వరరావు పాలకుల అరాచకాలను బయటపెట్టాలని చూశారు. దానిలో తప్పేముంది?

★ తెలుగు దేశంప్రభుత్వం అధికారంలోఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి , ఇతరవైసీపీనేతలుఎక్కడికీ వెళ్లలేదా?

★ ఏమీలేకపోయినా, ఎక్కడాఏమీ జరగకపోయినా టీడీపీప్రభుత్వం అవినీతి చేస్తోందని గగ్గోలుపెట్టలేదా?

★ మరిప్పుడు అదేవైసీపీనేతలు ప్రశ్నిస్తే దాడిచేస్తారా? ప్రతిపక్షనేతలను చంపేస్తారా?

★ పత్రికల్లో వచ్చేకథనాలపై ప్రభుత్వంగానీ, పాలకులుగానీ స్పంది స్తున్నారా? అలావచ్చే ఏకథనాలపై ప్రభుత్వంచర్యలు తీసుకుంది?

Also read

Total Page Visits: 123 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed