SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దివిసీమ సమగ్ర స్వరూపం, సాగునీటి పరిస్థితి కలెక్టర్ జె నివాస్ కు వివరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు*

1 min read

*కృష్ణాజిల్లా అవనిగడ్డ*

*

జిల్లా కలెక్టర్ .జె నివాస్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు సోమవారం పులిగడ్డ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశమై దివిసీమ ఇరిగేషన్ కెనాల్స్ డ్రెయిన్లు, సాగునీటి పరిస్థితి, ఎదురుమొండి దీవులు, నాచుగుంట వద్ద ఉప్పు కట్ట కోతకు గురికావడం, తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులు ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఆనంతరం శాసనసభ్యునితో, ఇరిగేషన్ అధికారులతో, ఇరిగేషన్ శాఖలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ తో కలెక్టర్ చర్చించారు.

గతంలో ఎనిమిది లక్షల క్యూసెక్కుల పైగా వరద వస్తే మునిగే ఆక్విడెక్ట్ ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే మునిగిపోతున్నదని ఎమ్మెల్యే వివరించారు.
ఎదురుమొండి దీవుల్లో సాగునీటి సమస్యలు, రోడ్ల పరిస్థితి పై ప్రజల జీవన స్థితిగతులపై శాసనసభ్యులు కలెక్టర్కు వివరించారు నాచుగుంట వద్ద ఉప్పు కట్ట కోతకు గురవుతున్న దని, అభివృద్ధి చేయాలని, డెల్టా ఆధునీకరణ లో రత్న కోడు మేజర్ డ్రేయిన్ మిగిలిన పనులు పూర్తి చేయాలని, దివిసీమలో ఔట్ ఫాల్స్ స్లూఇస్ ల పరిస్థితి, ఎదురుమొండి దీవులలో 4697 ఎకరాల సాగు ఆయకట్టు ఉందని, పంటలు బాగా పండుతాయని, పంటల సాగులో రైతుల ఇబ్బందులు, త్రాగునీటి సమస్యలు ఎమ్మెల్యే కలెక్టర్ కు వివరించారు.


దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహారావు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కమిటీలో అధికారులు గిరిధర్ రెడ్డి, కే శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ ఇ మురళి కృష్ణ రెడ్డి, ఈ ఈ రాజా స్వరూప్, పి డి డ్వా మ జి వి సూర్యనారాయణ, ఇరిగేషన్ డి ఈ రవి కిరణ్, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల ఏఈ లు, తాసిల్దారు శ్రీనివాస నాయక్, ఎం డి ఓ లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు

Total Page Visits: 51 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed