SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తంబళ్లపల్లె ఎమ్మెల్యే వేధింపులు భరించలేకున్నాం

1 min read

తిరుపతి: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి.. నియోజకవర్గంలో కార్యకర్తలను వేధించడంతోపాటు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వైకాపాకు చెందిన తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త కొండ్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ద్వారకానాథరెడ్డి నియంతలా, తన మాటే చెల్లుబాటు కావాలనే తీరుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘ఎమ్మెల్యే తన వ్యతిరేకులపై కేసులు బనాయిస్తున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీకి పని చేసిన కార్యకర్తలు ప్రస్తుతం భయభ్రాంతులతో జీవిస్తున్నారు. ఆయన అరాచకాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం పలుమార్లు విఫలమైంది. పుంగనూరు నుంచి ద్వారకానాథరెడ్డి వలస వచ్చినప్పటికీ గెలిపించాం. ప్రస్తుతం స్థానికులకు న్యాయం చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అందలం ఎక్కిస్తున్నారు. మా తరఫున పలువురు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారనే అక్కసుతో మాపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. తెదేపా హయాంలోనూ మేం ఇన్ని ఇబ్బందులు పడలేదు’ అని కొండ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరాచకాలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Also read

Total Page Visits: 109 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed