SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జలవివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రోజా

1 min read

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంపై స్పందించారు. ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణకు తగదని.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయొద్దని రోజా కోరారు. జల వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని.. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని రోజా అన్నారు.

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం రోజా
దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు చేశారు. 14 ఏళ్లలో ఏనాడు చంద్రబాబు మహిళల రక్షణ కోసం కృషి చేయలేదని, మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. టీడీపీ నేతలు
దొంగ దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సిఎం జగన్
దక్కుతుందని రోజాఅన్నారు.

Total Page Visits: 143 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed